అనవసరంగా రివ్యూ ఇచ్చాడు.. రెండేళ్లు జైలుకు?

మనం సాధారణంగా పెద్ద పెద్ద హోటల్స్ కి లేదా షాపింగ్ మాల్స్ కి వెళ్ళినప్పుడు, లేదా నగలు కొనడానికి వెళ్ళినప్పుడు కస్టమర్లను రివ్యూ అడగడం గమనిస్తూ ఉంటాం.ఆ రివ్యూ రేటింగ్స్ ఆధారంగా వారి బిజినెస్ లో మార్పులు చేసుకోవడం జరుగుతుంది.

 Us Man, Jail Writing, Negative Review, Thailand Hotel, America, Wesliey  Barnnes-TeluguStop.com

అచ్చం అలాగే ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద హోటల్స్ ,రెస్టారెంట్లలో ఫుడ్ ఎలా ఉందో అక్కడికి వచ్చే కస్టమర్ల నుంచి రివ్యూ రేటింగ్ తీసుకోవడం జరుగుతుంది. థాయిలాండ్ లో ఒక కస్టమర్ ఇచ్చిన రివ్యూ రేటింగ్ ఏకంగా ఆ వ్యక్తి అరెస్ట్ కు కారణం అయింది.

అంతగా రివ్యూ రేటింగ్స్ లో ఏమి ఇచ్చాడు? ఎందుకు అరెస్టు చేశారో తెలుసుకుందాం.

అమెరికాకు చెందిన వెస్లీ బార్నెస్ అనే వ్యక్తి థాయిలాండ్ లో ఇంగ్లిష్ టీచర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.

అయితే అతను ఒక రోజు కోహ్ చాంగ్ ఐలాండ్ లో ఉన్న చాంగ్ రెస్టారెంట్ కి తనతోపాటు జిన్ బాటిల్ ను తీసుకు వెళ్ళాడు.అయితే హోటల్ యాజమాన్యం దానికి అభ్యంతరం తెలుపుతూ బార్నెస్ కి 15 కోర్కేజ్‌ డాలర్ల జరిమానా కూడా విధించింది.

ఫుడ్ తిన్నాక బిల్లు చూసుకున్న వెస్లీ ఆశ్చర్యానికి గురయ్యాడు.ఎందుకు ఇంత బిల్లు అని అడుగగా హోటల్ యాజమాన్యం వెస్లీ మధ్య గొడవ జరిగింది.

దీంతో తిన్న దానికి మాత్రమే బిల్లు చెల్లించండి అపరాధం అవసరం లేదని ఆ వ్యక్తికి సర్దిచెప్పి హోటల్ యాజమాన్యం పంపించారు.

అంతటితో వెస్లీ ఆగకుండా ఇంటికి వెళ్లి, ఆన్లైన్ లో హోటల్ గురించి కస్టమర్ రివ్యూలో నెగిటివ్ గా రావడంతో, ఆ హోటల్ యాజమాన్యం వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు వెస్లీ ని అరెస్ట్ చేసి రెండు రోజుల పాటు జైల్లో ఉంచారు.అంతే కాకుండా ,3160 డాలర్ల జరిమానా కూడా విధించారు.

అతని తప్పు ఉందని విచారణలో తేలితే రెండేళ్ల పాటు జైలు శిక్ష కూడా పడవచ్చు అని పోలీసులు చెబుతున్నారు.అతని మీద పోలీస్ కేసు నమోదు అవడంతో అతను పనిచేస్తున్న స్కూల్ నుంచి అతనిని తొలగించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube