ఒక్క బీర్ తాగాడు..2.20 లక్షలు టిప్ ఇచ్చాడు.. ఎవరంటే?  

Man Tips USD 3,000 To Nighttown Restaurant Amid Covid, Three Thousand dollars, Nighttown Restaurant,covid pandemic, Tip,One Beer - Telugu 000 To Nighttown Restaurant Amid Covid, 2.20 Lakhs Tip, America, Beer Tip, Corona Virus, Covid Pandemic, Man Tips Usd 3, Nighttown Restaurant, Ohio, Three Thousand Dollars, Tip

ఎవరైనా ఏదైనా హోటల్ కి వెళ్లి భోజనం చేసినా లేదా మరి కొంతమంది బీర్ తాగడానికి వెళ్లినా చివరిగా వారికి తోచినంత టిప్ ఇచ్చి వస్తుంటారు.కానీ ఒక బీరు తాగి నందుకు ఏకంగా మూడు వేల డాలర్లు టిప్ ఇవ్వడం మీరు ఎక్కడైనా చూశారా? వినడానికి ఎంతో ఆశ్చర్యంగా అనిపించిన ఈ సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది.అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం…

TeluguStop.com - Us Man Gave Three Thousand Dollar Tip One Beer

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం రెస్టారెంట్లకు, హోటళ్లకు పెద్దగా డిమాండ్ లేకపోవడంతో దాదాపు నష్టాలను చవి చూస్తున్నారు.ప్రజలు బయట ఆహారం తీసుకోవడానికి భయ పడుతున్న నేపథ్యంలో ఇలాంటి పరిణామాలు తలెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో అమెరికాలోని ఓహియో ప్రాంతంలో కరోనా కేసులు తీవ్రమవుతుడడంతో అక్కడ రెస్టారెంట్లను మూసి వేస్తున్నారు.

TeluguStop.com - ఒక్క బీర్ తాగాడు..2.20 లక్షలు టిప్ ఇచ్చాడు.. ఎవరంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ నేపథ్యంలోనే 2001 నుంచి బ్రెండన్ రింగ్ అనే వ్యక్తి నైట్‌టౌన్ పేరిట ఓహియోలో రెస్టారెంట్ నడుపుతున్నాడు.కరోనా వల్ల నష్టాలు లో నడుస్తున్న తన రెస్టారెంట్ ను మూసేయాలని నిర్ణయించుకున్నాడు.అయితే సోమవారం చివరిగా తన రెస్టారెంట్ మూసే సమయంలో…తరచూ ఆ రెస్టారెంట్ కి వెళ్లే ఓ యువకుడు కుటుంబ సభ్యులతో రెస్టారెంట్ కి వెళ్లి ఒక బీరు ఆర్డర్ చేశాడు.

అయితే ఆ బీర్ విలువ 7 డాలర్లు కాగా.ఆ యువకుడు ఏకంగా మూడు వేల డాలర్లను అదనంగా స్వైప్ చేశాడు.

కళ్ళద్దాలు లేకపోవడంతో మూడు వందల డాలర్లు అధికంగా ఇచ్చాడు ఏమో అనుకున్న ఆ రెస్టారెంట్ యజమాని తర్వాత చూడగా ఏకంగా ఆ యువకుడు మూడు వేల డాలర్లను అదనంగా ఇవ్వడం చూసి షాక్ అయ్యాడు.వెంటనే ఆ యువకుడు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి మీరేం చేశారు నాకు అర్థం కాలేదు అనగా… మీరు చూసింది నిజమే 3000 డాలర్లను మీకు టిప్ గా ఇచ్చానని దీనిని స్టాఫ్ అంతా సమానంగా తీసుకోవాలని చెప్పి వెళ్ళాడు.

అతని మంచి హృదయానికి మనసులోనే ఆ యజమాని కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.

#COVID Pandemic #Man Tips USD 3 #2.20 Lakhs Tip #Beer Tip #000To

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు