అధ్యక్ష పదవి నుంచి ట్రంప్‌‌‌ను తొలగిస్తారా: కేబినెట్ ముందు రెండు అస్త్రాలు..!!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో పది రోజుల్లో మాజీ అయిపోతారు.కానీ ఓటమిని అంగీకరించని ఆయన మనస్తత్వంతో తనంతట తానే చిక్కులు కొని తెచ్చుకుంటున్నారు.

 Us Lawmakers Seek Immediate Removal Of President Trump After His Supporters Stor-TeluguStop.com

నాలుగు రోజులు కళ్లు మూసుకుంటే గౌరవంగా పదవి నుంచి తప్పుకుంటే మంచిదని ఎంతమంది చెబుతున్నా ట్రంప్ వినడం లేదు.ఓడిపోయినా నాదే పైచేయి అన్నట్లుగా వ్యవహరిస్తూ చివరి రోజుల్లో మరింత అప్రతిష్టను మూటకట్టుకుంటున్నారు.

అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేసేలా వ్యవహరిస్తున్న ఆయన తీరుపై డెమొక్రాట్లు, రిపబ్లికన్లు మండిపడుతున్నారు.

తాజాగా అధ్యక్షుడిగా డెమొక్రాట్‌ జో బైడెన్‌ గెలుపును ధ్రువీకరించే సమావేశాన్ని అడ్డుకునేందుకు ట్రంప్ తన మద్ధతుదారులను ఉసిగొల్పారు.

ఆయన దండు వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ బిల్డింగ్‌ను చుట్టుముట్టి వీరంగం సృష్టించిన సంగతి తెలిసిందే.ఉద్రిక్తతలను అణచివేసే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించారు.రాను రాను ట్రంప్ రాక్షసంగా ప్రవర్తిస్తుండటంతో ఆయన చేతుల్లోని అధికారాన్ని లాక్కోవాలని కేబినెట్ డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది.ఉన్నపళంగా ట్రంప్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించే అంశంపై సాధ్యాసాధ్యాలను మంత్రి మండలి సభ్యులు పరిశీలిస్తున్నారు.

Telugu Article, Democrats, Republicans, Donald Trump, Washington Dc-Telugu NRI

సాధారణంగా అగ్రరాజ్యాధినేతను పదవి నుంచి తొలగించాలంటే రెండు మార్గాలున్నాయని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు.ఒకటి అభిశంసన తీర్మానం, రెండోది రాజ్యాంగంలోని 25వ అధికరణం.అధ్యక్షుడు తన విధులను సక్రమంగా నిర్వర్తించకుండా.పదవిని స్వచ్ఛందంగా తప్పకోని పరిస్ధితుల్లో ఈ సవరణ అమల్లోకి వస్తుంది.ఇటువంటి పరిస్ధితుల్లో ఉపాధ్యక్షుడు, కేబినెట్ కలిసి అధ్యక్షుడిని తొలగించేలా 25వ అధికరణం అధికారం కల్పించింది.ఈ సమయంలో ఉపాధ్యక్షుడి నేతృత్వంలో కేబినెట్ సమావేశం నిర్వహించి మెజార్టీ సభ్యుల తీర్మానం ద్వారా ఆయనను పదవి నుంచి తప్పించవచ్చు.

ఇక అభిశంసన విషయానికి వస్తే.అధ్యక్షుడు నేరాలకు, ఇతరత్రా అక్రమాలకు పాల్పడినప్పుడు 435 మంది వున్న ప్రతినిధుల సభ సమక్షంలో ఓటింగ్ నిర్వహిస్తారు.

ఇక్కడ తీర్మానం ఆమోదించిన తర్వాత సెనేట్‌కు పంపుతారు.అక్కడ విచారణ అనంతరం సెనేట్‌లోని 2/3 వంతు మెజార్టీతో అధ్యక్షుడిని తొలగించవచ్చు.

అయితే సొంతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసన స్వరాలు వినిపిస్తుండటంతో ఆయన రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.దీనిపై ఆయన తన సలహాదారులతో చర్చిస్తున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube