అమెరికా క్యాపిటల్ ఘోరం...ట్రంప్ పై విచారణ ఫలితమేనా...??

అమెరికాకు అత్యంత గౌరవప్రధమైన అమెరికా క్యాపిటల్ భవనంపై దాడి ఘటన యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.ఈ ఘటనలో సుమారు 5 మంది మృతి చెందారు.

 Us Lawmakers Draw Battle Lines Over Search Of Donald Trump's Home,capitol Buildi-TeluguStop.com

ఈ ఘటనలో చనిపోయిన వారిలో ఆందోళన కారులతో పాటు పోలీసు ఉన్నత అధికారులు కూడా ఉన్నారు.బిడెన్ అధికారంలోకి వచ్చిన తరువాత క్యాపిటల్ భవన్ దాడిని సీరియస్ గా తీసుకుంది.

ప్రత్యేకమైన విచారణ కమిటిని నియమించిన ప్రభుత్వం క్యాపిటల్ భవనంకు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసింది.ప్రస్తుతం విచారణ కమిటి ఈ దాడి ఘటనకు ట్రంప్ ప్రధాన సూత్రదారుడు అనే సాక్ష్యాధారాలను సేకరించినట్టుగా అక్కడి పత్రికలు కూడా వెల్లడించాయి.

కాగా తాజాగా

ఈ రోజు ఉదయం క్యాపిటల్ హిల్ వద్ద ఘోరమైన ఘటన చోటు చేసుకుంది.ఊహించని విధంగా వేగంగా వచ్చిన ఓ కారు క్యాపిటల్ హిల్ కు వెళ్ళే మార్గంలో వేగంగా వెళ్తూ అక్కడి సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేసిన బారీకేడ్లను డీ కొట్టడంతో ఒక్కసారిగా అలజడి రేగింది.

అక్కడ ఏం జరుగుతుందో పోలీసు సిబ్బంది తెలుసుకునేలోగానే కారు లోంచి బయటకు దిగిన ఓ వ్యక్తి తుపాకితో కాల్పులు జరుపుతూ చివరిగా తనని తాను కాల్చుకుని చనిపోయాడు.ఈ ఘటతో అప్రమత్తమైన పోలీసులు క్యాపిటల్ హిల్ వద్ద, విచారణ చేపడుతున్న విచారణ కమిటికి భద్రతను పెంచారు.ఇదిలాఉంటే

Telugu America, Capitol Attack, Donaldtrump, Fbi, Republican, Lawmakers-Telugu N

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై విచారణ జరుగుతున్నది మొదలు, మొన్నటికి మొన్న ట్రంప్ ఎస్టేట్ లో ఎఫ్ బిఐ సోదాలు జరుగుతున్నప్పటి నుంచీ ఫెడరల్ అధికారులకు, విచారణ కమిటికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ప్రభుత్వ భవనాలపై కూడా దాడులు జరిగే అవకాశం ఉందని సమాచారం అందిన కొద్ది గంటలలో లోనే ఈ ఘటన జరిగిందని పోలీసులు అంటున్నారు.కాగా, ట్రంప్ ను కావాలనే కుట్ర పూరితంగా ఈ కేసుల్లో ఇరికిస్తున్నారనే ఆరోపణలు రిపబ్లికన్ పార్టీ నేతల నుంచీ బలంగా వినిపిస్తున్నాయి.ఈ నేపధ్యంలో క్యాపిటల్ హిల్ దాడి ఘటనలో అలాగే ట్రంప్ తన ఆస్తుల విషయంలో ప్రభుత్వానికి పన్ను కట్టకుండా మోసం చేశారనే ఆరోపణల్లో పక్క సాక్ష్యాదారాలు ఉన్నాయని చెప్తున్నారు అధికారులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube