భారత్ లో రైతులకు మద్దతు తెలిపిన అమెరికా చట్టసభ్యులు..!!

భారత ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై దేశ వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్న విషయం విధితమే.కేవలం దేశ వ్యాప్తంగా మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా కేంద్రం తీసుకున్న నిర్ణయాలపై సర్వాత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

 Us Lawmakers Voice Support To Indian Farmers, Republican Congressman Doug Lamalf-TeluguStop.com

ముఖ్యంగా అమెరికాలోని భారతీయులు, సిక్కు వర్గం కేంద్రం తీసుకున్న నిర్ణయంపై గడిచిన కొన్ని రోజులుగా నిరసనలు వ్యాప్తం చేస్తున్నారు.కాగా అమెరికాలోని చట్టసభ్యులు సైతం భారత్ తీసుకున్న నిర్ణయం సరైనది కాదంటూ ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది.

అమెరికాలోని అమెరికా కాంగ్రెస్ సభ్యుడు డగ్ లామల్ఫా భారత్ లోని రైతుల నిరసనలపై స్పందించారు.భారత ప్రభుత్వం వారిని తప్పు దారి పట్టించే నిర్ణయాలు తీసుకుంటోంది.

ఈ నిర్ణయానికి నేను వ్యతిరేకంగా రైతులకు మద్దతు ఇస్తున్నాని ప్రకటించారు.అలాగే కాలిఫోర్నియా రిపబ్లికన్ చట్టసభ్యుడు మాట్లాడుతూ రైతులు శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నారు అలాంటప్పుడు వారిని అంగీకరించాలని తెలిపారు.

డెమోక్రటిక్ పార్టీకి చెందిన కాంగ్రెస్ సభ్యుడు జోష్ హార్దర్ మాట్లాడుతూ భారత్ అతిపెద్ద ప్రజాస్వామ దేశం రైతుల శాంతియుత నిరసనలను తెలిపేందుకు అనుమతించాలని కోరారు.అంతేకాదు

అమెరికాలో అత్యధిక సంఖ్యాక భారత ఎన్నారైలు అయిన సిక్కులు, ఆయా సంఘాల నేతలు అందరూ కూడా భారత్ తీసుకునే నిర్ణయాలు కార్పోరేట్ శక్తులకు రైతుల శ్రమను దోచేలా ఉన్నాయని వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనలు తెలిపారు.

అయితే తాము తీసుకున్న నిర్ణయాలపై మాట్లాడే హక్కు కేవలం భారతీయులకు మాత్రమే ఉంటుందని, విదేశీ చట్టసబ్యులు మాట్లాడాల్సిన అవసరం లేదని భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలలో విదేశీ నేతల జోక్యం చేసుకోవడం సరైనది కాదని వారి వ్యాఖ్యలను ఖండించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube