హెచ్ 1 బీ వీసా: వేతన పరిమితిపై అభిప్రాయ సేకరణ, 60 రోజుల డెడ్‌లైన్

విదేశీ వృత్తి నిపుణులను అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతినిచ్చే హెచ్ 1 బీ సహా వివిధ రకాల వీసాలు జారీ చేసే విషయంలో వేతన పరిమితిపై బైడెన్ సర్కార్ దృష్టి సారించింది.దీనిలో భాగంగా ఆయా వీసాలకు వేతన పరిమితి ఎంతెంత నిర్ణయించాలో అభిప్రాయాలు తెలపాల్సిందిగా అమెరికా లేబర్ డిపార్ట్‌మెంట్ 60 రోజుల గడువునిచ్చింది.

 Us Labour Deptartment Seeks Public Input On Determining H-1b Wage Levels, H-1b-TeluguStop.com

హెచ్-1బీ వీసా అనేది నాన్ ఇమిగ్రెంట్ వీసా.ఈ వీసా ఉన్న వారు అమెరికా కంపెనీల్లో ఉపాధి పొందొచ్చు.అయితే ఆయా కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోవాలంటే.వారిలో ప్రత్యేక నైపుణ్యాలు తప్పనిసరి.ఇదే పద్ధతిలో అమెరికా టెక్ కంపెనీలు ఏటా వేల సంఖ్యలో విదేశీ సిబ్బందిని నియమించుకుంటున్నాయి.వీరిలో భారత్, చైనాలకు చెందిన వారే ముందు వరుసలో వున్నారు.

Telugu Donald Trump, Wage Levels, Hb Visa, Joe Biden, Publicinput-Telugu NRI

కాగా.గతంలో హెచ్‌1బీ వీసాదారుల వార్షిక వేతన పరిమితి 65 వేల డాలర్లుగా ఉండేది.అయితే వలసలకు చెక్ పెట్టి.అమెరికా పౌరులకు భారీగా ఉపాధి అవకాశాలు లభించేలా చేసేందుకు గాను మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వేతన పరిమితిని 1.10 లక్షల డాలర్లకు పెంచాలని ప్రతిపాదించారు.తాను అధ్యక్షుడిగా దిగిపోవడానికి కొద్దిరోజుల ముందు ఈ కనీస వేతన నిబంధనలను ట్రంప్ తీసుకువచ్చారు.హెచ్-1బీ, ఈ 3 నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాల ద్వారా శాశ్వత, తాత్కాలిక ప్రాతిపదికన విదేశీ వృత్తి నిపుణులను నియమించుకునే కంపెనీలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని ట్రంప్ తెలిపారు.ఆయన నిర్ణయంపై అప్పట్లో ప్రతిపక్షాలు, టెక్ సంస్థలు సహా అనేక వలసవాద సంఘాలు తమ నిరసన తెలియజేశాయి.

అయితే ట్రంప్‌ సర్కార్‌ తీసుకున్న ఈ నిర్ణయం అమలును మరో 18 నెలలు వాయిదా వేయాలని బైడెన్‌ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే.దీంతో కార్మిక శాఖకు ఈ నిబంధనల చట్టబద్ధత, విధానపరమైన సమస్యలను సమగ్రంగా విశ్లేషించి పరిష్కరించేందుకు తగిన సమయం లభిస్తుందని అధ్యక్షుడు భావిస్తున్నారు.

ఈ నెల మొదటి వారంలో బైడెన్ ప్రభుత్వం ఈ నిబంధనల అమలును తొలుత 60 రోజుల పాటు వాయిదా వేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.తాజా ఉత్తర్వులతో ఈ నిబంధనల అమలు గడువు 2022 నవంబర్‌ 14 వరకు పెంచినట్లయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube