అమెరికా: ఆర్ఎస్ఎస్ అనుబంధ హెచ్ఎస్ఎస్‌కు సన్మానం.. టెక్సాస్ పోలీస్ శాఖపై జర్నలిస్ట్ ఆగ్రహం

గత నెల 21న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అంతర్జాతీయ విభాగమైన హిందూ స్వయం సేవక్ సంఘ్ (హెచ్ఎస్ఎస్) ఇర్వింగ్ శాఖను టెక్సాస్ పోలీస్ డిపార్ట్‌మెంట్ సత్కరించింది.అయితే పోలీసుల చర్యను ప్రముఖ అమెరికన్ జర్నలిస్ట్, కార్యకర్త పీటర్ ఫ్రీడ్‌రిక్ తప్పుబట్టారు.

 Us Journalist Calls Out Texas Police For Befriending Rss, Rss, Hss, Us Journalis-TeluguStop.com

గతంలో హిందుత్వకు వ్యతిరేకంగా గళం విప్పిన ఈయన.నగర కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు.హెచ్ఎస్ఎస్‌కు పోలీస్ శాఖ సత్కారం.అమెరికా సంయుక్త రాష్ట్రాలలో నివసిస్తున్న భారతీయ మైనారీటీను ఎలా కలవరపెడుతోందో వివరించారు.

2002లో భారతదేశంలోని గుజరాత్ వీధుల్లో ఆర్ఎస్ఎస్ శ్రేణులు వేలాది మంది ముస్లింలను చంపడం, అత్యాచారాలకు పాల్పడటం, సజీవదహనం వంటి అకృత్యాలకు పాల్పడుతున్నా పోలీసులు బొమ్మల్లా చూస్తూ నిలబడ్డారని .దీంతో ఈ మారణకాండ నిరాంతరాయంగా సాగిందని ఫ్రీడ్‌రిక్ వ్యాఖ్యానించారు.భారతదేశంలో ఆర్ఎస్ఎస్ పాత్ర గురించి ఆయన చెబుతూ.ఇండియాలోని పోలీసులు ఆర్ఎస్ఎస్‌తో కుమ్మక్కయ్యారని ఆరోపించారు.ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు భారతీయ ముస్లింలను, క్రైస్తవులను దేశద్రోహులుగా చిత్రీకరించారని ఫ్రీడ్‌రిక్ మండిపడ్డారు.యూరోపియన్ ఫాసిస్ట్ ఉద్యమాలను ఆదర్శంగా తీసుకోవాలని… ప్రధానంగా యూదుల పట్ల నాజీలు వ్యవహరించిన విధానాన్ని అనుసరించాలనే ఉద్దేశాన్ని గతంలోనే ఆర్ఎస్ఎస్ వెలిబుచ్చిందని పీటర్ గుర్తుచేశారు.

Telugu America, Hss, Pieterfriedrich, Texas, Journalist, Journalisttexas-Telugu

గడిచిన 20 ఏళ్లలో భారతదేశంలో ఆర్ఎస్ఎస్ నిర్వహించిన ప్రతి ప్రధాన మైనారిటీ వ్యతిరేక కార్యక్రమాలకు పోలీసుల సహకారం వుందని పీటర్ ఆరోపించారు.2002లో గుజరాత్ అల్లర్ల నుంచి 2008లో ఒడిషా (క్రైస్తవ సన్యాసినుల సామూహిక అత్యాచారం), 2020లో ఢిల్లీలో పోలీసులే అల్లరి మూకలకు తలుపులు బద్ధలుకొట్టి మరి ముస్లింలను అప్పగించడం వరకు రక్షకభటులు ఆర్ఎస్ఎస్‌కు మద్ధతుగా నిలిచారని ఆయన చెప్పారు.

తాజాగా అమెరికాలోని ఇర్వింగ్ పోలీసులు నిలబడి హెచ్ఎస్ఎస్‌ని గౌరవించినప్పుడు.లెక్కలేనంతమంది భారతీయ అమెరికన్ క్రైస్తవులు, దళితులు, ముస్లింలు, సిక్కులు.ఎవరైతే ఆర్ఎస్ఎస్ వల్ల నష్టపోయారో వారికి ఈ చర్య ఎలాంటి సందేశాన్ని పంపుతుందని ఫ్రీడ్‌రిక్ ప్రశ్నించారు.కాగా, గతంలో హిందుత్వకు వ్యతిరేకంగా మాట్లాడిన సమయంలో తనకు హిందుత్వ వాదుల నుంచి తనకు సోషల్ మీడియాలో బెదిరింపులు వస్తున్నాయని చెప్పారు.ఈ ఏడాది ఆగస్టులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ (ఆర్ఎస్ఎస్) మద్ధతున్న ఎన్జీవో సంస్థ సేవా ఇంటర్నేషనల్‌కు ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే 2.5 మిలియన్ డాలర్లు విరాళం ఇచ్చినందుకు నిరసనగా ఫ్రీడ్‌రిక్ నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube