అమెరికా ఇంటిలిజన్స్ నివేదిక : మోడీ మామూలోడు కాదు..తేడా వస్తే పాక్ తోలు తీస్తాడు..!!

మోడీ ప్రధాని అయిన తరువాత.అవ్వక మునుపు భారత్ పరిస్థితులు, విదేశీ సంభంద వ్యవహారాలు దేశాలకు దేశాలు భారత్ కు తో స్నేహ హస్తం కోసం పరితపించడం ఇవనీ మనం గమనిస్తూనే ఉన్నాం.

 Us Intel Report Pm Modi Leadership India Pakistan-TeluguStop.com

అంతేకాదు భారత్ వైపు శత్రు దేశాలు కన్నెత్తి చూడాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునే స్థాయిలో భారత్ ఉందంటే అందుకు మోడీ విధానాలే కారణమనేది అందరికి తెలిసిందే.భారత్ పై నిత్యం విషం కక్కుతో కయ్యానికి కాలు దువ్వే పాక్ కుడా మోడీ వ్యూహాలకు చతికలపడుతోంది.

అయితే పాక్ గనుకా హింసకు ప్రేరేపిస్తూ భారత్ పై కాలు దువ్వితే మోడీ ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవడానికి సిద్దంగా ఉన్నారని ఇప్పటికే పాక్ కు హెచ్చరికలు జారీ అయ్యాయి.తాజాగా

 Us Intel Report Pm Modi Leadership India Pakistan-అమెరికా ఇంటిలిజన్స్ నివేదిక : మోడీ మామూలోడు కాదు..తేడా వస్తే పాక్ తోలు తీస్తాడు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదే విషయాన్ని అమెరికా ఇంటిలిజన్స్ కూడా ధృవీకరించింది.

మోడీ తో తేడా లోస్తే పాక్ తో కయ్యానికి ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయడానికి సిద్దంగా లేరని, పాక్ పై ఎలాంటి చర్యలు చేపట్టడానికైనా సిద్దంగా ఉన్నారని చెప్పింది.చర్చలు లాంటి కాలయాపన పనులు చేసే ఓపిక ఇక భారత పభుత్వానికి అసలు లేదనే విషయాన్ని కూడా వెల్లడించింది.

అసలు అమెరికా ఈ విషయాన్ని ఇంత అత్యవసరంగా వెల్లడించడానికి కారణం ఏంటి.

అమెరికా ఇంటలిజెన్స్ విభాగం ప్రతీ ఏటా అమెరికా కాంగ్రెస్ కు వార్షిక నివేదిక అందిస్తుంది.

ఈ నివేదికలో ఆయా విభాగాల నివేదికలను పరిశీలించి తదుపరి కార్యాచరణ చేపడుతుంది ప్రభుత్వం.అయితే తాజాగా అమెరికా ఇంటిలిజన్స్ విభాగం కాంగ్రెస్ కు ఇచ్చిన నివేదికలో పాకిస్తాన్ గనుకా తన హద్దులు మరిచి పోయి భారత్ పై కాలు దువ్వితో భారత సైనిక చర్యలు చేపట్టడానికి సిద్దంగా ఉందని , మోడీ ఆధ్వర్యంలో నడుస్తున్న భారత ప్రభుత్వం గతంలో కంటే ప్రస్తుతం తమ వైఖరిని మార్చుకుందని, చర్చలతో కాలయాపన చేయడం ఇష్టం లేదని, రాయబారాలకు అస్సలు తావులేదని సైనిక చర్యలు చేపట్టడానికి మోడీ ప్రభుత్వం వెనుకాడదని, భవిష్యత్తు లో కాశ్మీర్ అంశం, ఉగ్ర దాడుల కారణంగా రెండు దేశాల మధ్య ఘర్షణలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తన నివేదికలో వెల్లడించింది.

#IndiaUnder #PM Modi #USIntelligence #Pakistan #India

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు