నాలుగు దశాబ్ధాల తర్వాత ఆల్ టైం హైకి ‘‘ద్రవ్యోల్బణం’’.... అమెరికాలో మండుతున్న ధరలు

ఓ వైపు కరోనా మహమ్మారితో అగ్ర రాజ్యం అమెరికా వణుకుతున్న సంగతి తెలిసిందే.కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే 11 లక్షల కేసులు నమోదవ్వగా.

 Us Inflation Reaches Highest Level In Four Decades As Consumer Prices Jump , New-TeluguStop.com

ఆసుపత్రుల ముందు రోగులు బారులు తీరుతున్నారు.రోజువారీ కేసుల సంఖ్య లక్షలను దాటడంతో వైద్యులు సైతం చేతులు ఎత్తేసే పరిస్ధితి నెలకొంది.ఒక్కరోజులోనే 11.30 లక్షల కేసులు నమోదయ్యాయంటే దేశంలో పరిస్ధితి ఏ స్థాయిలో వుందో అర్ధం చేసుకోవచ్చు.న్యూజెర్సీ, డెలావర్, మేరీల్యాండ్, ఒహియో, వాషింగ్టన్, వర్జీనియా, పెన్సిల్వేనియా వంటి రాష్ట్రాలలో కేసుల సంఖ్య రికార్డు స్థాయికి చేరుకుంది.పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో అమెరికా గతి ఏంటంటూ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పరిస్థితి ఇలా వుంటే గోరుచుట్టు మీద రోకటి పోటులా అమెరికాకు కొత్త సమస్య వచ్చింది.కోవిడ్ ప్రభావం మరోసారి ఉత్పత్తి రంగంపై పెను ప్రభావం చూపుతోంది.ముడి పదార్థాలు, సెమీ కండక్టర్‌ల కొరత అన్ని దేశాలను వేధిస్తోంది.దీంతో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్భణం జెట్ స్పీడుతో దూసుకెళ్తోంది.

భారతదేశంలో ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా ద్రవ్యోల్భణం భారీగా పెరిగింది.తాజాగా హోమ్ అప్లయెన్సెస్ , సౌందర్య ఉత్పత్తుల ధరలు పెరిగాయి.

ప్రభుత్వ చర్యలతో వంట నూనెల ధరలు స్వల్పంగా దిగొచ్చిన మిగతా వస్తువుల ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి.అమెరికాలోనూ పరిస్ధితులు దారుణంగా మారుతున్నాయి.

దాదాపు 39 ఏళ్ల తర్వాత అమెరికాలో ద్రవ్యోల్భణం ఆల్ టైం రికార్డుకు చేరింది.అక్కడి మార్కెట్‌లలో ఏకంగా 7 శాతం వరకు ధరలు పెరిగాయి.1982 జూన్ నుంచి అమెరికాలో స్థిరంగా కొనసాగిన ద్రవ్యోల్భణం.డిసెంబర్ 2021లో అత్యంత వేగంగా పెరిగినట్టు యూఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ ఒక నివేదికలో పేర్కొంది.గతేడాది నవంబర్ నెలలో 6.8 శాతంగా ఉన్న ద్రవ్యోల్భణం డిసెంబర్ 2021 నాటికి ఒక్క నెలలోనే 7 శాతానికి చేరుకుంది.

ప్రధానంగా గృహాలు, వాహనాల ధరలలో రెట్టింపు స్థాయిలో పెరుగుదల కనిపించినట్టు తెలుస్తోంది.ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు అధ్యక్షుడు జో బైడెన్, ఫెడరల్ రిజర్వ్‌లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.కోవిడ్ మాంద్యం నుంచి వేగంగా కోలుకోవడంతో కార్లు, గ్యాస్, ఆహారం, ఫర్నిచర్ ధరలు 2021లో బాగా పెరిగాయి.ప్రభుత్వ సహాయం, చౌకైన వడ్డీ రేట్లు వస్తువుల డిమాండ్‌ను పెంచడంలో దోహాద పడ్డాయని ఆర్ధిక నిపుణులు అంటున్నారు.

అమెరికాలోనే కాదు .యూరో కరెన్సీని ఉపయోగించే 19 యూరోపియన్ దేశాలలోనూ ద్రవ్యోల్బణం 5 శాతం పెరిగింది.గడిచిన ఏడాదితో పోలిస్తే ఇది రికార్డు స్థాయి పెరుగుదల.

US inflation reaches highest level in four decades as Consumer prices jump

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube