పిడుగులాంటి వార్త..భారతీయులు 195 ఏళ్ళు ఆగాల్సిందే...!!

అమెరికాలో శాశ్వత నివాసం పొందాలని గ్రీన్ కార్డ్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న భారతీయులకి ఇది నిజంగా పిడుగులాంటి వార్తే.లక్షలాది మంది భారతీయులు ఎదురు చూస్తున్న గ్రీన్ కార్డ్ పొందాలంటే దాదాపు 195 ఏళ్ళు వరకూ భారతీయులు ఎదురు చూడాల్సిందేనని అంటున్నారు అధికార పార్టీ నేత మైక్ లీ.

 Green Card Waitlist For Indian Is More Than 195 Years, Mike Lee, Us Green Card,c-TeluguStop.com

ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ మైక్ చేసిన వ్యాఖ్యలు రిపబ్లికన్ పార్టీలో ఆందోళన కలిగిస్తున్నాయి.అయితే ఈ గండం నుంచీ బయటపడాలంటే భారతీయులు ఒక్కటే మార్గం అంటున్నారు సెనేటర్ ఆ వివరాలలోకి వెళ్తే.

భారతీయులు గ్రీన్ కార్డ్ కోసం ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారు కానీ గ్రీన్ కార్డ్ విధానంలో భారీ మార్పులు చేయకపోతే వారి కలలు అలాగే ఉండిపోతాయి ప్రస్తుత గ్రీన్ కార్డ్ విధానంలో మార్పులు అవసరమని మైక్ లీ తెలిపారు.ఈ పరిస్థితి నుంచీ బయటపడాలంటే చట్టపరమైన పరిష్కారంతో సెనేటర్లు అందరూ సహకరించాలని అన్నారు.

గ్రీన్ కార్డ్ కోసం ఆర్జీ పెట్టుకున్న వలస దారుడు ఎవరైనా సరే చనిపోతే వారి కుటుంభ సభ్యులకి ఈ ఫలితం అందటం లేదని అన్నారు.వలస దారులు శాశ్వతంగా అమెరికాలో ఉండాలంటే గ్రీన్ కార్డ్ తప్పని సరి అయినపుడు కొన్ని మార్పులు చేయడంలో ప్రభుత్వం సహకరించాలని తెలిపారు.అయితే

Telugu Green, Greenwaitlist, Mike Lee-

అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీ స్థాయిలో ఉంది.ముఖ్యంగా భారతీయులు లక్షలాది మంది ఉన్నారు.వారికి ఇప్పట్లో గ్రీన్ కార్డ్ రాదనే రిపబ్లికన్ పార్టీ సెనేటర్ వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయనే చెప్పాలి.అసలు గ్రీన్ కార్డ్ వస్తుందా రాదా అనే విషయాలపై తర్జన భర్జన పడుతున్నారు.

ఈ పరిస్థితుల నేపధ్యంలో ఈ ప్రభావం అంతా ఎన్నికలపై తప్పకుండా పడుతుందని అంచనాలు వేస్తున్నారు నిపుణులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube