పిడుగులాంటి వార్త..భారతీయులు 195 ఏళ్ళు ఆగాల్సిందే…!!

అమెరికాలో శాశ్వత నివాసం పొందాలని గ్రీన్ కార్డ్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న భారతీయులకి ఇది నిజంగా పిడుగులాంటి వార్తే.

లక్షలాది మంది భారతీయులు ఎదురు చూస్తున్న గ్రీన్ కార్డ్ పొందాలంటే దాదాపు 195 ఏళ్ళు వరకూ భారతీయులు ఎదురు చూడాల్సిందేనని అంటున్నారు అధికార పార్టీ నేత మైక్ లీ.

ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ మైక్ చేసిన వ్యాఖ్యలు రిపబ్లికన్ పార్టీలో ఆందోళన కలిగిస్తున్నాయి.

అయితే ఈ గండం నుంచీ బయటపడాలంటే భారతీయులు ఒక్కటే మార్గం అంటున్నారు సెనేటర్ ఆ వివరాలలోకి వెళ్తే.

భారతీయులు గ్రీన్ కార్డ్ కోసం ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారు కానీ గ్రీన్ కార్డ్ విధానంలో భారీ మార్పులు చేయకపోతే వారి కలలు అలాగే ఉండిపోతాయి ప్రస్తుత గ్రీన్ కార్డ్ విధానంలో మార్పులు అవసరమని మైక్ లీ తెలిపారు.