భారత్‌లో నేరాలు చేసిన ఎంతోమంది ఇక్కడ శిక్ష నుంచి తప్పించుకోవడానికి విదేశాలకు చెక్కేస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఎంతోమంది గ్యాంగ్‌స్టర్లు, అండర్ వరల్డ్ డాన్‌లు, నీరవ్ మోడీ, మొహుల్ చోక్సీ , విజయ్ మాల్యా వంటి ఆర్ధిక నేరగాళ్లు భారత్ నుంచి పారిపోయి విదేశాల్లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే.
వీరిని స్వదేశానికి రప్పించేందుకు భారత దర్యాప్తు సంస్థలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.కానీ చట్టాలు, విచారణ ఇతర లాంఛనాలు ముగిసి వారిని భారత్‌కు రప్పించడం అంత తేలిక కాదు.
ఇంకొందరైతే విదేశాల్లో నేరాలు చేసి భారత్‌కు పారిపోయి వస్తున్నారు.
ఇదిలావుండగా.
భారత సంతతికి చెందిన భద్రేష్ పటేల్‌ను( Bhadresh Patel ) అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ)( FBI ) తన మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఒకడిగా చేర్చింది.ఇతని కోసం 2017 నుంచి ఎఫ్‌బీఐ వేటాడుతోంది.
గుజరాత్‌లోని( Gujarat ) విరామ్‌గామ్‌కు చెందిన 26 ఏళ్ల పటేల్.ఏప్రిల్ 2015లో మేరీల్యాండ్‌లో తన భార్యను హత్య చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
ఈ క్రమంలోనే పటేల్‌ను టాప్ 10 మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో చేర్చిన ఎఫ్‌బీఐ అతని తలపై 2,50,000 డాలర్ల రివార్డ్‌ను సైతం ప్రకటించింది.

ఎఫ్‌బీఐ చేత కోల్డ్ బ్లడెడ్ హంతకుడిగా , అత్యంత ప్రమాదకరమైన నేరస్తుడిగా అభివర్ణించబడ్డాడు.ఇతను మేరీలాండ్ హనోవర్‌లోని డంకిన్ డోనట్స్ స్టోర్‌లో తన భార్యను హత్య చేశాడు.భారత్‌కు తిరిగి వెళ్లిపోదామని భార్య తరచుగా ఒత్తిడి చేయడంతో పటేల్ ఆమెను హతమార్చినట్లుగా తెలుస్తోంది.
నివేదిక ప్రకారం.పటేల్ ఓ గుర్తు తెలియని వస్తువుతో తన భార్యను విచక్షణారహితంగా కొట్టాడు.
దీని కారణంగానే ఆమె ప్రాణాలు కోల్పోయింది.ఈ నేరానికి గాను ఏప్రిల్ 13, 2015న మేరీలాండ్ డిస్ట్రిక్ట్ కోర్టు ( Maryland District Court ) పటేల్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

అంతేకాదు.భారత సంతతికి చెందిన మానవ అక్రమ రవాణా ముఠాల ద్వారా పటేల్ అక్రమంగా కెనడాలోకి ప్రవేశించినట్లుగా తెలుస్తోంది.అలాగే విచారణ నుంచి తప్పించుకోవడానికి చట్టవిరుద్ధంగా విమానాలను కూడా వాడాడు.ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 20, 2015న యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్, డిస్ట్రిక్ట్ ఆఫ్ మేరీల్యాండ్, బాల్టిమోర్ కోర్టులు భద్రేష్ పటేల్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేశాయి.
