ఆర్ధిక కష్టాల్లో యూఎస్‌సీఐఎస్: ఏడాదిన్నర నుంచి రెవెన్యూలోటుతోనే , అంబుడ్స్‌మన్ సంచలన నివేదిక

దేశ విదేశాల్లోని ప్రజలకు వీసాలు మంజూరు చేయడంతో పాటు అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యస్థను నియంత్రించే యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) రెవెన్యూ లోటుతో కొట్టుమిట్టాడుతోంది.ఈ విషయాన్ని స్వయంగా హోంలాండ్ సెక్యూరిటీ విభాగం అంబుడ్స్‌మన్ తెలిపారు.2020 ఆరంభంలో కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా ఏజెన్సీకి ఇమ్మిగ్రేషన్ దరఖాస్తు రుసుముల ద్వారా వచ్చే రాబడి పూర్తిగా పడిపోయింది.దీంతో యూఎస్‌సీఐఎస్ తీవ్ర కష్టాలను ఎదుర్కొంటోంది.

 Us Immigration Agency Still Facing Financial Struggles, Homeland Security, Usci-TeluguStop.com

దీని నుంచి గట్టెక్కేందుకు గాను నాడు అధ్యక్షుడిగా వున్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వాన్ని బిలియన్ డాలర్ల బెయిల్ ఔట్ కోరింది.

ఈ ఏజెన్సీ నష్టాల్లో కొనసాగడం వల్ల అంతిమంగా అది వీసాల మంజూరులో జాప్యానికి దారి తీస్తుందని అంబుడ్స్‌మన్ కాంగ్రెస్‌కు ఇచ్చిన వార్షిక నివేదికలో ఆందోళన వ్యక్తం చేశారు.

తద్వారా బ్యాక్‌లాగ్‌లు పెరగడం, ప్రాసెసింగ్ సమయాన్ని పెంచే అవకాశం వుందని చెప్పారు.కొత్తగా నియమించుకున్న వారితో పాటు 13,000 మంది సిబ్బందిని ఇబ్బంది పెట్టకుండా వుండేందుకు గాను ఏజన్సీ ఖర్చులను బాగా తగ్గించుకుందని అంబుడ్స్‌మన్ అన్నారు.

కోవిడ్ వల్ల దేశంలోని కార్యాలయాలను నెలల పాటు యూఎస్‌సీఐఎస్ మూసివేయగా.ఇటీవలే పరిమిత సామర్ధ్యంతో కార్యకలాపాలను ప్రారంభించిందని అంబుడ్స్‌మన్ నివేదిక స్పష్టం చేసింది.

దీని పర్యవసానంగా యూఎస్ వీసా దరఖాస్తులు, పునరుద్దరణ వంటి ప్రాసెసింగ్ సమయం నెలల తరబడి పెండింగ్‌లో పడిపోయింది.దీని వలన అమెరికాలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపిందని అంబుడ్స్‌మన్ చెప్పారు.

అదనపు నిధులను సేకరించడానికి యూఎస్‌సీఎస్ ప్రీమియం ప్రాసెసింగ్ సేవలను విస్తరించడానికి అక్టోబర్‌లో అమెరికా కాంగ్రెస్ అనుమతి ఇచ్చింది.ఇది దరఖాస్తులను వేగంగా క్లియర్ చేసేందుకు గాను అభ్యర్థుల నుంచి అధిక రుసుమును వసూలు చేసేందుకు ఏజెన్సీకి వెసులుబాటు కల్పించింది.

దీనితో పాటు ఈ ఏడాది తర్వాత అదనపు ప్రయోజనాలు అందించాలని యూఎస్‌సీఐఎస్ యోచిస్తోంది.అయితే ప్రీమియం ప్రాసెసింగ్ శ్రమతో కూడుకున్నదని అంబుడ్స్‌మన్ నివేదిక పేర్కొంది.ప్రస్తుతం ఏజెన్సీ పరిమిత సిబ్బందితోనే ప్రాసెసింగ్ కార్యక్రమాలను చేపడుతోంది.

Telugu American, Donald Trump, Uscis, Uscs Premium-Telugu NRI

కాగా, యూఎస్‌సీఐఎస్‌ని ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడేసేందుకు గాను హౌస్ డెమొక్రాట్లు 2022 ఆర్ధిక సంవత్సరానికి గాను హోంలాండ్ సెక్యూరిటీ స్పెండింగ్ బిల్లులో బ్యాక్‌లాగ్‌లను పరిష్కరించడానికి 474.5 మిలియన్ డాలర్లను కేటాయించాలని ప్రతిపాదించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube