లాక్‌డౌన్‌లో ఇండో అమెరికన్ల పెద్ద మనసు: ఐదు నెలల్లో 15 వేల కుటుంబాలకు ఆపన్నహస్తం  

Over 15,000 Families In US Helped By Group Of Indian-Americans Amid Coronavirus, US , Indian-Americans, Coronavirus, Families, Lockdown,Drive through food - Telugu 000 Families In Us Helped By Group Of Indian-americans Amid Coronavirus, Coronavirus, Families, Indian-americans, Lockdown, Over 15, Us

కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు.లక్షలాది మంది ప్రాణాలను తీసుకోవడంతో పాటు అన్ని రంగాలను సంక్షోభంలోకి నెట్టి మానవాళి మునుపెన్నడూ చూడని దృశ్యాలను కళ్లముందు పెట్టింది.

TeluguStop.com - Us Helped By Group Of Indian Americans Amid Coronavirus

కత్తికి రెండు వైపులా పదునున్నట్లు కోవిడ్ 19 మనిషిలో ఉన్న మానవత్వాన్ని తట్టిలేపింది.తోటి వ్యక్తి కూడా మనలాంటి వాడేనన్న సంగతిని గుర్తించిన ఎంతో మంది ఆపదలో ఉన్న వారిని ఆదుకున్నారు.

లాక్‌డౌన్ సమయంలో కొందరు మనసున్న మనుషులు నిత్యావసరాలు, వసతి, భోజనం, ఆర్ధిక సాయాలు అందించారు.
దీనిలో భాగంగా కరోనా మహమ్మారి సమయంలో అమెరికాలోని వాషింగ్టన్ డీసీ మెట్రో ప్రాంతంలో స్థిరపడిన భారతీయ అమెరికన్ సమాజం తన పెద్దమనసు చాటుకుంది.

TeluguStop.com - లాక్‌డౌన్‌లో ఇండో అమెరికన్ల పెద్ద మనసు: ఐదు నెలల్లో 15 వేల కుటుంబాలకు ఆపన్నహస్తం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

యూఎస్‌లో కరోనా ఉద్ధృతి మొదలైన మే నెల నుంచి నేటి వరకు సుమారుగా 15 వేల కుటుంబాలకు నిత్యావసరాలు, ఆహారాన్ని అందించింది.కరోనా వైరస్‌ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి ఆహారాన్ని అందించేందుకు గాను ‘‘ డ్రైవ్ త్రూ ఫుడ్’’ అనే ప్రోగ్రామ్‌లో భాగంగా సుమారు 250 కార్లను ఉపయోగించింది.

దీనిపై ఇండో అమెరికన్ సమాజానికి చెందిన డాక్టర్ సురేశ్ మాట్లాడుతూ.ఇప్పటి వరకు ఈ ప్రాంతంలోని కనీసం 15 వేల కుటుంబాలకు నిత్యావసర వస్తువులను సరఫరా చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ క్లిష్ట సమయంలో కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి తాము చేసిన చిన్న ప్రయత్నం వారికి చేయూతను అందించిందని సురేశ్ చెప్పారు.ఈ ఫుడ్ డ్రైవ్ కార్యక్రమంలో భారతీయ అమెరికన్ ప్రముఖులు, స్థానిక చర్చి, వాషింగ్టన్ డీసీ మెట్రో ప్రాంతంలోని కౌంటీ అధికారులు తలో చేయి వేశారు.

ఈ 250 కార్ల యజమానులు, వారి కుటుంబసభ్యులతో కలిసి ఆహారాన్ని సేకరించడం, పంపిణీ చేయడం వంటి విధులు నిర్వర్తించేవారు.ప్రధానంగా పేదరికంలో ఉన్న వారికి, ఆహారం లేక ఇబ్బంది పడుతున్న వారికి వాటిని అందజేసేవారు.

కష్టకాలంలో తమ కడుపునింపిన భారతీయ అమెరికన్ సమాజానికి పలువురు కృతజ్ఞతలు తెలియజేశారు.ఆహార పంపిణీకి సంబంధించిన వివరాలను భారతీయ అమెరికన్ ప్రతినిధులు స్థానిక ఎన్జీవోలు, ఫుడ్ బ్యాంకులకు, ప్రార్థనా మందిరాలకు అందజేసేవారు.

కాగా భారత జాతిపిత మహాత్మా గాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 2 నుంచి దీపావళి వరకు ఫుడ్ డ్రైవ్ నిర్వహించాలని భారతీయ సమాజం భావిస్తోంది.

#Families #000Families #Over 15 #Lockdown #Coronavirus

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Us Helped By Group Of Indian Americans Amid Coronavirus Related Telugu News,Photos/Pics,Images..