అమెరికాలో గన్ కల్చర్..తమ్ముడిని కాల్చి చంపిన 3 ఏళ్ళ బాలుడు..!!

అమెరికాలో విచ్చలవిడిగా, ఎదేశ్చగా సాగుతున్న తుపాకులు వాడటంపై నిషేధం విధించాలని ఎన్నో ఏళ్ళుగా నిరసనలు, ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి.కానీ ఎక్కడా కూడా గన్ కల్చర్ నియంత్రణపై చర్యలు తీసుకున్న ధాఖలాలు కనపడలేదు.

 Us Gun Fire  : 8 Month Old  Boy Killed By Brother With Gun , America, Gun Cultu-TeluguStop.com

గత ప్రభుత్వ అధ్యక్షులు కానీ ట్రంప్ హయాంలో కానీ గన్ కల్చర్ పై తీసుకున్న చర్యలు శూన్యమనే చెప్పాలి.ఇక బిడెన్ అధ్యక్షుడు అయిన తరువాత గన్ కల్చర్ నియంత్రణపై పెద్దగా స్పందించిన ధఖాలలు కూడా లేవు.

ఈ క్రమంలోనే అమెరికాలో ఈ మధ్య కాలంలో తుపాకుల వాడకం ద్వారా మృతి చెందుతున్న ఘటనలు రోజు రోజుకు పెరిగిపోవడంతో బిడెన్ అలెర్ట్ అయ్యారు.గన్ కల్చర్ పై ఎన్నికల ప్రచారంలో కూడా పెద్దగా ప్రస్తావించని బిడెన్ జరుగుతున్న పరిణామాల దృష్ట్యా గన్ కల్చర్ నియంత్రణపై ముందడుగు వేశారు.

నిషేధానికి సంభందించిన కీలకమైన మార్గదర్సకాలపై నివేదిక ఇవ్వాలని నిపుణులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ ఆదేశాలు ఇచ్చి రెండు 48 గంటలు కూడా గడవక ముందు అమెరికాలో రెండు సార్లు గన్ ఫైర్ జరిగిన సంఘటనలు నమోదు అయ్యాయి.

అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో జరిగిన గన్ ఫైరింగ్ ఘటన యావత్ అమెరికాను ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాకుండా అమెరికా తుపాకి సంస్కృతికి అద్దం పడుతోంది.టెక్సాస్ రాష్ట్రంలోని హ్యుస్టన్ నగరంలో ఓ ఇంట్లో మూడేళ్ళ బాలుడు ఆడుకుంటున్నాడు.

అతడు ఆడుకుంటున్న క్రమంలో తుపాకి దొరికింది.అది బొమ్మ తుపాకి అనుకున్న బాలుడు తన 8 నెలల తమ్ముడిపై సరదాగా కాల్పులు జరిపాడు.

ఛాతీ లోకి బుల్లెట్లు దిగడంతో అక్కడికక్కడే నెలల పిల్లాడు మృతి చెందాడు.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పిల్లాడి చేతికి తుపాకి ఎలా వచ్చింది, సదరు గన్ కి లైసెన్స్ ఉందా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.ఈ ఘటనపై మానవ హక్కుల సంఘాలు మరోసారి భగ్గుమన్నాయి.

తుపాకులపై నియంత్రణ పెట్టనంత వరకూ ఇలాంటి ఘటనలు మనం అమెరికాలో రోజుకొకటిగా చూస్తూనే ఉండాల్సి వస్తుందని మండిపడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube