దొడ్డిదారిలో అమెరికాకు: జైళ్లలో మగ్గుతున్న భారతీయులు, 161 మంది విడుదల

అమెరికాలో చిన్న కొలువు దొరికినా చాలు లక్షల సంపాదించి జీవితంలో స్థిరపడాలని కలలుకనే భారతీయులు లక్షల్లో ఉన్నారు.అయితే అక్కడికి వెళ్లడం అంత సులభమైన విషయం కాదు.

 Us Govt To Deport 161 Indians Who Were Arrested For Entering Illegally,us Govt,-TeluguStop.com

దీనికి సవాలక్ష పర్మిషన్లు, డాక్యుమెంట్లు కాకుండా లక్షల్లో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.అయినప్పటికీ అగ్రరాజ్యంలో అడుగుపెడతామన్న గ్యారెంటీ లేదు.

ఈ క్రమంలో చట్టబద్ధంగా అనుమతులు దొరకని పక్షంలో దొడ్డిదారిలో అక్రమంగా వెళ్లాలని ప్రయత్నించి అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులకు చిక్కి జైళ్లలో మగ్గుతున్నవారు వేలల్లో ఉన్నారు.

ఇలా అక్రమంగా ప్రవేశించిన 161 మంది భారతీయులను వెనక్కి పంపించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఛార్టెర్డ్ విమానంలో వీరిని ఈ వారం భారతదేశానికి తరలించనుంది.అమెరికా నుంచి నేరుగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు వీరిని పంపనున్నారు.విడుదలైన వారిలో 76 మంది హర్యానా, 56 మంది పంజాబ్, 12 మంది గుజరాత్, ఐదుగురు ఉత్తరప్రదేశ్, నలుగురు మహారాష్ట్ర, కేరళ, తెలంగాణ, తమిళనాడు నుంచి ఇద్దరు చొప్పున.తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నారు.161 మందిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు.

Telugu Indians, American Punjab, Deportindians-

వీరిలో ఎక్కువగా మెక్సికోతో ఉన్న దక్షిణ సరిహద్దు నుంచే అమెరికాలోకి ప్రవేశించినట్లు వెల్లడించింది.వీరికి ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం.అన్ని న్యాయమార్గాలు ముగియడంతో తిరిగి భారతదేశానికి పంపించాలని నిర్ణయించారు.

అమెరికాకు అక్రమ మార్గాల ద్వారా ప్రవేశించే క్రమంలో వీరంతా అరెస్ట్ అయినట్లు నార్త్ అమెరికన్ పంజాబ్ అసోసియేషన్ (నాపా) కు చెందిన సత్నాం సింగ్ చాహల్ తెలిపారు.అధికారిక లెక్కల ప్రకారం అమెరికాలో ఇప్పటి వరకు 95 జైళ్లలో 1,739 మంది భారతీయులు మగ్గుతున్నారు.వీరందరిలో ఉత్తర భారతీయులే ఎక్కువగా ఉన్నారు.2018లో 611 మంది, 2019లో 1,616 మంది భారతీయులను వెనక్కి పంపినట్లు అమెరికా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వెల్లడించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube