అమెరికాలోనూ జగనన్న అమ్మఒడి.. బైడెన్ యంత్రాంగం కసరత్తు..?

ప్రజల సంక్షేమం, శ్రేయస్సు కోసం ప్రభుత్వాలు రకరకాల పథకాలను అమలు చేస్తుంటాయి.ఒక దగ్గర సక్సెస్ అయిన ఈ పథకాలు మరో రాష్ట్రంలో, దేశంలో అమలు చేసిన దాఖలాలు ఎన్నో చూశాం.

 Us Govt Ready To Implement Jaganna Amma Vodi,us Govt, Jaganna Amma Vodi,corona V-TeluguStop.com

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన 108, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ వంటి పథకాలను మనదేశంలోని ఎన్నో రాష్ట్రాలు అమలు చేశాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు ఐక్యరాజ్యసమితి ప్రశంసలు పొందాయి.

ఆ వెంటనే నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జీ వంటి వారు రైతు బంధును పేరు మార్చి అమలు చేశారు.

ఇక అసలు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో అక్షరాశ్యత పెంపే లక్ష్యంగా… అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.

ఇందుకోసం బడ్జెట్‌లో వేల కోట్లు కేటాయించింది.పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి బ్యాంక్‌ అకౌంట్లో సంవత్సరానికి రూ.15వేలు వేస్తామని వైఎస్‌ జగన్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆయన ఈ పథకానికి శ్రీకారం చుట్టారు.దీనిని ముందుగా 1–10 తరగతుల విద్యార్థులకు ప్రవేశపెట్టినా… ఇంటర్‌ వరకూ వర్తింపజేయాలని సీఎం నిర్ణయించారు.

ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క చిన్నారీ బడికి దూరం కాకూడదన్న ఆశయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ పథకానికి రూపకల్పన చేశారు.అన్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, ప్రయివేట్‌ జూనియర్‌ కళాశాలలు, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు ఈ పథకం వర్తిస్తుంది.

Telugu Corona, Joe Biden, Readyjaganna-Telugu NRI

అయితే ఇలాంటి ఓ పథకమే తెచ్చేందుకు అమెరికా కూడా యోచిస్తోంది.ప్రతి చిన్నారికి నెల నెలా 300 డాలర్లు (భారత కరెన్సీలో రూ.21 వేలు) భృతి ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది.కరోనా వైరస్ ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా దీన్ని చేపట్టే ఆలోచన చేస్తోంది అక్కడి బైడెన్ ప్రభుత్వం.

అయితే, ప్రస్తుతమున్న విధానాలు ‘అత్యవసర సాయం’ చేయడం మీదే ఎక్కువగా దృష్టి పెట్టాయని, శాశ్వత మార్పు తెచ్చేలా వ్యూహాలను అనుసరించాల్సిన అవసరం ఉందని బైడెన్ అధికార ప్రతినిధి ఇటీవల వ్యాఖ్యానించారు.కానీ, పిల్లలకు భృతి అందించే ఇలాంటి కార్యక్రమాన్ని కొన్నేళ్ల పాటు నిరంతరాయంగా కొనసాగిస్తే శాశ్వత మార్పునకు అవసరమైన పునాదులు పడతాయని అమెరికాలో పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తున్నవారి మాట.ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాల్లోకెల్లా అమెరికాలోనే బాలల్లో పేదరికం ఎక్కువగా ఉంది.
ఇక రిపబ్లికన్ పార్టీకి చెందిన సెనేటర్ మిట్ రోమ్నీ లాంటి వాళ్లు సైతం ఈ తరహా నెలవారీ భృతి ఇచ్చే కార్యక్రమాలు ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

అమెరికాలో జననాల రేటు రికార్డు స్థాయికి పడిపోతున్న తరుణంలో ఇలాంటి కార్యక్రమాలు అవసరమని రోమ్ని అభిప్రాయపడ్డారు.మరి బైడెన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది త్వరలోనే తేలిపోనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube