చైనాలో అంతుచిక్కని వైరస్, ఇద్దరి మృతి: అమెరికా ఎయిర్‌పోర్టుల్లో హైఅలర్ట్

సార్స్‌ను పోలిన ఒక వింత వైరస్ ధాటికి చైనా, జపాన్‌లో పలువురు మరణించడంతో యూఎస్ ప్రభుత్వ అప్రమత్తమైంది.అన్ని ఎయిర్‌పోర్టులో అలర్ట్ ప్రకటించి.

 Us Govt Begins Screening Flyers After Sars In China-TeluguStop.com

చైనా నుంచి వచ్చే వారికి పరీక్షలు జరపాల్సిందిగా అధికారులను ఆదేశించింది.

యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ)కి చెందిన సీనియర్ అధికారి మార్టిన్ సెట్రాన్ మీడియాతో మాట్లాడుతూ.

కరోనావైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉండటంతో అమెరికన్ ప్రజల ఆరోగ్యాన్ని మరింతగా కాపాడటానికి సీడీసీ స్క్రీనింగ్ టెస్టులు ప్రారంభించినట్లు తెలిపారు.ప్రధానంగా శాన్‌ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, లాస్‌ ఏంజిల్స్ విమానాశ్రయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు.

Telugu Flyers Sars, Telugu Nri Ups-

రాబోయే రెండు వారాల్లో స్క్రీనింగ్ పాల్గొంటారని అంచనా.శుక్రవారం రాత్రి నుంచి 5000 మంది పరీక్షల్లో పాల్గొన్నారు.ఎంట్రీ పాయింట్ వద్ద ప్రయాణికులు ఒక ప్రశ్నాపత్రాన్ని నింపి, శరీర ఉష్ణోగ్రతను సమర్పించాలి.అనంతరం రోగ నిర్థారణ పరీక్ష కోసం మరో చోటికి పంపుతారు.కాగా సెంట్రల్ చైనా నగరమైన వుహాన్‌లో‌ సార్స్ వైరస్‌ను పోలిన వైరస్‌తో ఓ 69 ఏళ్ల వ్యక్తి మరణించిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం చైనాలో 41 మంది ఈ వైరస్ లక్షణాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది.శుక్రవారం వుహన్ నుంచి వచ్చిన 74 ఏళ్ల మహిళలో ఈ లక్షణాలను గుర్తించారు.2002-2003లో సార్స్ వైరస్ కారణంగా చైనా, హాంకాంగ్‌‌లలో దాదాపు 650 మంది ప్రాణాలు కోల్పోయారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube