అమెరికా వాయు దళాల పొరపాటుకు 17 మంది ఆఫ్ఘన్ పోలీసులు బలి  

Us Force Kill 17 Afghan Police Officers-air Force,america,kill 17,us Force,అమెరికా,ఆఫ్ఘన్ పోలీసులు

అగ్రరాజ్యం అమెరికా వాయు దళాలు చేసిన ఒక చిన్న పొరపాటు కారణంగా 17 మంది ఆఫ్ఘన్ పోలీసులు బలైపోయారు. ఉగ్రవాదుల శిబిరాలు అని భావించిన అమెరికా వాయు దళాలు ఆఫ్ఘన్ పోలీస్ శిబిరాలపై కాల్పులు జరపడం తో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనితో ఈ ఘటనలో 17 మంది పోలీసులు మరణించగా,మరో 14 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. ఆఫ్ఘన్ రక్షణ దళాలకు,తాలిబన్ లకు మధ్య భీకర పోరు చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆఫ్ఘన్ రక్షణ దళాలకు మద్దతుగా అమెరికా వాయు దళాలు కూడా తాలిబన్ల పై యుద్దానికి దిగారు..

అమెరికా వాయు దళాల పొరపాటుకు 17 మంది ఆఫ్ఘన్ పోలీసులు బలి -US Force Kill 17 Afghan Police Officers

అయితే ఉగ్రవాదుల శిబిరాలపై కాల్పులు జరపాల్సింది పోయి పొరపాటున ఆఫ్ఘన్ రక్షణ దళాల శిబిరాలపై కాల్పులు జరపడం తో 17 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటనపై విచారణ జరిపి పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆఫ్ఘన్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. తాలిబన్ల ను నియంత్రించడానికి గత కొంత కాలంగా ఆఫ్ఘన్ లో అమెరికా వాయు దళాలు చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఆఫ్ఘన్ రక్షణ దళాలకు సపోర్ట్ గా అమెరికా వాయు దళాలు అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

అయితే అమెరికా దళాలు ఒక్క చిన్న పొరపాటు తో 17 మంది ఆఫ్ఘన్ పోలీసులు బలయ్యారు.