అమెరికా FBI వార్షిక నివేదికలో విస్తుపోయే నిజాలు..!!

అమెరికాలో జాత్యహంకార దాడులపై అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) గత ఏడాదికి గాను అందించిన నివేదికలో విస్తుపోయే నిజాలను వెల్లడించింది.గత ఏడాది అమెరికాలో విద్వేష పూరిత హత్యలు హెచ్చుస్థాయిలో జరిగాయని అలాగే నేరాల సంఖ్య కూడా భారీగా నమోదు అయ్యిందని తన నివేదికలో వెల్లడించింది.2019 లో సుమారు 51 మంది హత్యకు గురయ్యారని, ఇందులో జాతి వివక్ష, వర్ణ వివక్ష కారణంగానే జారిగాయని పేర్కొంది.ఇదిలాఉంటే 2018 లో ఇలాంటి నేరాలతో 21 మంది మృతి చెందగా కేవలం 2019 లో ఆ సంఖ్య అమాంత పెరిగిపోయిందని తెలిపింది…ఇదిలాఉంటే

 Us Fbi Investigation In America Telugu Nri News Updates-TeluguStop.com

1990 సంవసత్సరం నుంచీ పోల్చుకుంటే కేవలం 2018 సంవసత్సరంలో అత్యంత దారుణమైన హత్యలు, నేరాలు జరిగాయని ఇలా జరిగిన నేరాలు అన్నీ కమ్యునిటీల రెచ్చగొట్టిన గొడవల కారణంగా జరిగాయని తెలిపింది.

ఒక వ్యక్తి నేరం చేసినట్టయితే అతడిని అరెస్ట్ చేసినా శిక్షించినా అతడి కమ్యూనిటీకి చెందిన వారి అందరి మనోభావాలు దెబ్బతినడంతో గొడవలు హెచ్చుమీరాయని, ఇలాంటి గొడవల కారణంగా జరిగిన నేరాలు, హత్యలే ఎక్కువగా నమోదయ్యాయని ప్రకటించింది.

Telugu Gun, America, Telugu Nri Ups, Fbi-Telugu NRI

ఇలాంటి కారణాల చేతనే ప్రజలు కొన్ని ప్రాంతాలలో అభద్రతా భావంతో బ్రతుకుతున్నారని ఏడీఎల్ సిఈవో జోనాధన్ గ్రీన్ బ్లాట్ వెల్లడించారు.కేవలం ఒక్క 2019లో మొత్తం 15 వేల లా ఎన్ఫోర్స్మెంట్ సంస్థలు నివేదికలు అందజేయగా వాటిలో దాదాపు 7314 విద్వేష నేరాలు జరిగాయని తెలిపింది.అంతకు ముందు సంవసత్సరం ఈ సంఖ్య 7120 గా ఉండేదని ఏడాది ఏడాదికి నేరాల సంఖ్య అమాంతం పెరుగుతూ వస్తోందని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్.

అయితే అమెరికాలో గన్ కల్చర్ కారణంగా మరణాల తీవ్రత ఎక్కువయ్యిందని ఈ విషయంలో ప్రభుత్వం దృష్టి పెట్టాలని పలు స్వచ్చంద సంస్థలు ఆర్జీలు పెడుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube