తగ్గేదెలే, వ్యాక్సినేషన్‌లో అమెరికా దూకుడు: ఇకపై 12-15 ఏళ్లలోపు పిల్లలకూ టీకా

2019 ఆఖర్లో చైనాలో పుట్టిన కరోనా వైరస్ చాప కింద నీరులా ప్రపంచం మొత్తాన్ని చుట్టేసింది.తగ్గుతూ, పెరుగుతూ ఇంకా మానవాళిపై పంజా విసురుతూనే వుంది.

 Us Expands Use Of Pfizer Covid-19 Vaccine To 12-15 Year Olds, Us, Pfizer Vaccine-TeluguStop.com

ఈ మహమ్మారి అంతం కోసం శాస్త్రవేత్తలు, ఫార్మా సంస్థలు రేయింబవళ్లు కష్టపడి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.దీంతో ప్రపంచ దేశాలు వ్యాక్సినేషన్ కార్యక్రమంపై దృష్టి పెట్టాయి.

వీరి కృషితో కోవిషీల్డ్, కొవాగ్జిన్, మోడెర్నా, ఫైజర్, ఆక్స్‌ఫర్డ్- ఆస్ట్రాజెనెకా, జాన్సన్ అండ్ జాన్సన్ , స్ఫుత్నిక్ వంటి టీకాలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి.ఇప్పటి వరకు అన్ని దేశాల్లోనూ 16, 18 ఏళ్లకు పైబడిన వారికే మాత్రమే టీకాలు వేస్తూ వస్తున్నారు.

అయితే 16 ఏళ్లలోపు వారికి మాత్రం ఇప్పటి వరకు వ్యాక్సిన్లు అందుబాటులో లేవు.ఈ నేపథ్యంలో అమెరికా కీలక ముందుడుగు వేసింది.

అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్, జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్‌ సంయుక్తంగా రూపొందించిన కరోనా టీకాను 12 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సు వారికి కూడా అందించేందుకు యూఎస్ ఆహార, ఔషధ నిర్వహణ సంస్థ (ఎఫ్‌డీఏ) ఆమోదం తెలిపింది.ఫైజర్‌- బయోఎన్‌టెక్‌ సంయుక్తంగా జరిపిన క్లినకల్‌ ట్రయల్స్‌లో 12-15 మధ్య వయసు పిల్లల్లో ఈ వ్యాక్సిన్‌ సమర్థవంతంగా పనిచేస్తుందని గుర్తించారు.

దేశంలోని దాదాపు 2,260 మంది పిల్లలపై ప్రయోగాలు జరిపారు.ఈ వివరాలను యూఎస్ సీడీసీ బృందం సమీక్షించి.

ఫలితాలపై సంతృప్తి చెందిన పక్షంలో ఈ టీకాకు అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాల్సిందిగా సీడీసీకి సిఫారసు చేయనుంది.అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే.

దేశంలోని 12 ఏళ్ల నుంచి 15 ఏళ్ల లోపు పిల్లలకు టీకా ఇవ్వడానికి వెసులుబాటు కలగనుంది.భారత్‌లో థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు వున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ సమయంలో పిల్లలకు ముప్పు తప్పదని అధ్యయనాలు చెబుతున్న వేళ. ఫైజర్ టీకా అందుబాటులోకి రావడాన్ని ఉపశమనంగా చెప్పుకోవచ్చు.అమెరికాలో పూర్తి స్థాయిలో వినియోగానికి అనుమతి లభించిన తర్వాత భారత్‌లోనై ఈ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌కు ఫైజర్ ప్రయత్నాలు ప్రారంభించే అవకాశం వుంది.

Telugu America, Covid Vaccine, Pfizer Vaccine, Pfizerbiontech, Expandspfizer-Tel

కాగా.ఫైజర్‌, బయో ఎంటెక్‌ వ్యాక్సిన్‌కు యూఎస్‌ రెగ్యులేటరి డిసెంబర్‌‌ మొదటి వారంలో అత్యవసర వినియోగానికి అనుమతించిన సంగతి తెలిసిందే.దీనిలో భాగంగా తొలి టీకాను ఓ నర్సుకు అందజేశారు అధికారులు.

క్వీన్స్‌లోని లాంగ్ ఐలాండ్‌ యూదు మెడికల్ సెంటర్‌లో క్రిటికల్ కేర్‌లో నర్సుగా పనిచేస్తున్న సాండ్రా లిండ్స్‌ అమెరికాలో తొలి కోవిడ్ టీకా తీసుకున్న వ్యక్తిగా చరిత్ర పుటల్లోకెక్కారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube