ట్రంప్ కు “మెలానియా షాక్” ఇస్తే “కూతురు బిగ్ షాక్” ఇచ్చింది...!!

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రాజకీయాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి అధ్యక్షుడు బిడెన్ పై విమర్శల వర్షం కురిపిస్తూ 2024 ఎన్నికలకు తాను సిద్దం అంటూ చెప్పకనే చెప్పేశారు.చైనా పై విమర్శల దాడులకు దిగుతూ, చైనా కు బిడెన్ కు మధ్య సంభంధాలు ఉన్నాయంటూ బిడెన్ ను బద్నాం చేసే పనిలో ఉన్న ట్రంప్ వచ్చే ఎన్నికల్లో తనదే విజయం అనే ధీమాను ఇప్పటి నుంచే ప్రదర్శిస్తున్నారు.అయితే బిడెన్ కు షాకులు ఇవ్వడానికి వ్యూహాలను సిద్దం చేసుకుంటున్న ట్రంప్ కు ఆయన సతీమణి, గారాల పట్టి కూతురు ఇవాంకా ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చారు.

 Us Ex President Donald Trump Divorce Melania News Viral-TeluguStop.com

75 వ జన్మదినోత్సవం వేడుకలను అంగరంగ నిర్వహించారు.న్యూజెర్సీలోని ఆయన నేషనల్ గోల్ఫ్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకులకు భంధువులు, స్నేహితులు, సన్నిహితులు ఇలా అతిరధ మహారధులు అందరూ వచ్చారు.కానీ ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్, ట్రంప్ గారాల పట్టి ఇవాంకా ట్రంప్ మాత్రం పుట్టిన రోజు వేడుకలకు హాజరు కాలేదు.

ఈ వార్త ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.అందరూ వచ్చారు, అయినోళ్ళు రాలేదు అంటూ వేడుకల్లో గుసగుసలు కూడా వినిపించాయట.

 Us Ex President Donald Trump Divorce Melania News Viral-ట్రంప్ కు మెలానియా షాక్ ఇస్తే కూతురు బిగ్ షాక్ ఇచ్చింది…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com


మెలానియా , ట్రంప్ పుట్టిన రోజు వేడుకలకు హాజరు కాకపోవడంతో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిన మాట వాస్తవమేనని, విడాకులు తీసుకోబోతున్నారు అంటూ గడిచిన కాలంగా వస్తున్న వార్తల్లో నిజం ఉండే ఉంటుందని అమెరికా మీడియా మళ్ళీ వార్తలు వండి వడ్డిస్తోంది.అంతేకాదు మెలానియా ట్రంప్ తన భర్త ట్రంప్ నుంచీ విడిపోయి సొంతగా తన జీవితాన్ని గడిపేందుకు సిద్దంగా ఉందని ఆమె సన్నిహితులు ఇదే విషయాన్ని వెల్లడించారని కూడా మీడియా తెలిపింది.ఈ విషయం కాస్తా చిలికి చిలికి గాలివాన కావడంతో ట్రంప్ వర్గం స్పందించింది.మెలానియా విడిపోవాలని అనుకుంటున్నారన్న వార్తల్లో నిజం లేదని, పార్టీ కి రాకపోతే విడిపోతున్నారని అనడం సరికాదని, ఇద్దరి మధ్య అలాంటి గొడవలు లేవంటూ క్లారిటీ ఇచ్చారు.

#DonaldTrump #Melania Trump #IvankaAbsent #DonaldAnd #Ivanka Trump

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు