అన్న మాట నిలబెట్టుకున్న అమెరికా .. 2023లో భారతీయులకు 10 లక్షల వీసాలు ..!!

అగ్రరాజ్యం అమెరికా భారతీయులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది.2023లో మన పౌరులకు 10 లక్షల వీసాలు జారీ చేస్తామని ప్రకటించిన ఆ దేశ విదేశాంగ శాఖ వాగ్థానాన్ని నెరవేర్చింది.ఈ విషయాన్ని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం( American Embassy ) ఎక్స్‌లో తెలిపింది.ఈ ఏడాది మిలియన్ వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేయాలన్న మా లక్ష్యం నెరవేరిందని.

 Us Embassy In India Surpasses Goal Of Processing One Million Non-immigrant Visas-TeluguStop.com

రాబోయే కాలంలో మరింత పురోగతిని సాధిస్తామని, మరింత ఎక్కువ మంది భారతీయులు అమెరికా వెళ్లేందుకు అవకాశం కల్పిస్తామని యూఎస్ ఎంబసీ ట్వీట్‌లో పేర్కొంది.అలాగే భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి( US Ambassador Eric Garcetti ) మాట్లాడుతున్న వీడియోను కూడా షేర్ చేసింది.

Telugu Chennai, Hyderabad, India, Immigrant Visas, Primenarendra, Ambassadoreric

పది లక్షల వీసాలు మంజూరు చేసిన రికార్డుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.ప్రపంచంలోనే భారత్‌తో అమెరికాకు అత్యంత కీలకమైన బంధం వుందన్నారు.ఇరుదేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతమైందని.ఈ బంధాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు భారతీయులకు రికార్డు స్థాయిలో వీసాలు మంజూరు చేస్తామని ఎరిక్ గార్సెట్టి పేర్కొన్నారు.కాగా అమెరికా ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా జారీ చేసిన వీసాల్లో 10 శాతం భారతీయులకే దక్కాయి.విద్యార్ధి వీసాలు 20 శాతం, హెచ్, ఎల్, కేటగిరీ ఉద్యోగ వీసాల్లో 65 శాతం భారతీయులకే మంజూరయ్యాయి.గతేడాది అమెరికాను 1.2 లక్షల మంది భారతీయులు సందర్శించారని రాయబార కార్యాలయం తెలిపింది.వీసా ప్రాసెసింగ్‌ను సులభతరం చేసేందుకు సిబ్బందిని విస్తరిస్తున్నామని.చెన్నై, హైదరాబాద్( Chennai, Hyderabad ) నగరాల్లో కొత్త కాన్సులేట్ భవనాలను ప్రారంభించినట్లు పేర్కొంది.

Telugu Chennai, Hyderabad, India, Immigrant Visas, Primenarendra, Ambassadoreric

కాగా.వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలతో పాటు పర్యాటకం కోసం భారతీయులు ఈ మధ్యకాలంలో విదేశాలకు వెళ్తున్నారు.ఇందులో అమెరికా తొలి స్థానంలో వుంది.అయితే ఇండియాలో రెండు కొత్త కాన్సులేట్ కార్యాలయాలను ప్రారంభించడం ద్వారా అగ్రరాజ్యానికి రానున్న రోజుల్లో భారతీయుల తాకిడి మరింత పెరిగే అవకాశం వుందని నిపుణులు అంటున్నారు.

ఈ ఏడాది జూన్‌లో ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi ) నాలుగు రోజుల పాటు అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొత్త మలుపు తిరిగాయి.

భారతీయుల వీసాలను మరిన్ని ప్రాసెస్ చేసేందుకు అమెరికా అంగీకరించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube