ట్రంప్ ని ఢీ కొట్టేది ఎవరో..?

అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో అమెరికా వ్యాప్తంగా ఎన్నికల ప్రచారాలు జోరందుకుంటున్నాయి రిపబ్లికన్ పార్టీ నుంచి ప్రత్యర్థి లేకపోవడంతో డోనాల్డ్ ట్రంప్ మళ్లీ అధ్యక్షుడిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.అయితే డెమోక్రటిక్ పార్టీ నుంచి భారత సంతతి వ్యక్తులు, అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు ఇలా ఎంతోమంది అధ్యక్ష బరిలో నిలబడటంతో డెమొక్రటిక్ పార్టీ నుంచి ఎవరు ఫైనల్ కి చేరుకుంటారు అనే ఉత్కంఠ నెలకొంది.

 Us Election 2020 Who Beats Trump-TeluguStop.com

డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి రేసులో అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ తనకు సొంత పార్టీలోనే ప్రత్యర్థిగా ఉన్న పేర్ని శాండర్స్ ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది.ఇద్దరూ ఒకరి పై ఒకరు పైచేయి సాధిస్తున్న ఈ క్రమంలో లో తాజాగా జో బిడెన్ , శాండర్స్ పై ఆధిక్యం కనపరుస్తూ వస్తున్నారు.కాలిఫోర్నియా, టెక్సాస్ వంటి రాష్ట్రాలలో ఇంకా పోలింగ్ ఉండటంతో శాండర్స్ సన్నిహితులు ఆయన విజయం పై ధీమా వ్యక్తం చేస్తున్నారు

Telugu Bernie Sanders, Donald Trump, Joe Biden-

ఇదిలా ఉంటే జో బిడెన్ అత్యధిక మెజారిటీ సాధించడంలో ఆఫ్రికన్ అమెరికన్లు కీలకపాత్ర పోషించినట్లు గా తెలుస్తోంది.ఆయనకి వారి మద్దతు అన్ని రాష్ట్రాల నుంచీ ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.మరోవైపు శాండర్స్ ప్రచార వర్గం మాత్రం ఆయన స్వరాష్ట్రం వెర్మాంట్ తో పాటు కొలరాడో, యూటా రాష్ట్రాలలో ఆధిక్యం కనబరిచారని, భవిష్యత్తులో బిడెన్ పై విజయం సాధించడం ఖాయమని, ట్రంప్ తో తలపడగలిగే సత్తా కేవలం శాండర్స్ కి మాత్రమే ఉందని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube