జైషే మహ్మద్‌ అధినేత మసూద్‌ అజార్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చేందుకు అమెరికా ప్రయత్నాలు

అంతర్జాతీయం: జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్‌ అజార్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చేందుకు అగ్రరాజ్యం ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది.మసూద్‌ విషయంలో ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఆంక్షల కమిటీని అతిక్రమించి అమెరికా చర్యలు చేపడుతోందంటూ ఇటీవల డ్రాగన్ దేశం చైనా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

 Us Efforts To Include Masood Azhars In Blacklist-TeluguStop.com

అయితే ఈ ఆరోపణలను అమెరికా తిరస్కరించింది.మసూద్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకుంటామని అమెరికా వెల్లడించింది.

‘అంతర్జాతీయ సమాజంలో మసూద్‌ అజార్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేందుకు మేం, మా మిత్రదేశాలు, ఐరాస భద్రతామండలిలోని దేశాలు కలిసి అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుంటాం’ అని అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి ఒకరు అంతర్జాతీయ మీడియాకు వెల్లడించారు.ఇందుకోసం యూకే, ఫ్రాన్స్‌ సహకారంతో సరికొత్త తీర్మానం రూపొందించామని, ఇటీవలే దాన్ని ఐరాస భద్రతామండలి సభ్య దేశాలకు పంపించినట్లు పేర్కొన్నారు.అయితే ఈ తీర్మానంతో ఐక్యరాజ్య సమితిని తక్కువ చేసి చూపుతున్నామని చైనా వాదించడం సరికాదని అన్నారు.

పుల్వామా దాడి తర్వాత మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు అమెరికా, యూకే, ఫ్రాన్స్‌ తీర్మానం తీసుకొచ్చిన విషయం తెలిసిందే.అయితే ఈ తీర్మానాన్ని ఐరాస భద్రతామండలిలోని 15 సభ్య దేశాల్లో 14 దేశాలు ఆమోదించగా.ఒక్క చైనా మాత్రం నిలిపివేసింది.

ఇప్పటికి 5 సార్లు ఈ విధంగా చైనా అడ్డుపడుతూ వస్తుంది.దీంతో తాజాగా అమెరికా మరో తీర్మానాన్ని తీసుకొచ్చింది.

మసూద్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చేలా తీర్మానాన్ని తయారుచేసి సభ్య దేశాలకు పంపించింది.అయితే ఈ కొత్త తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం అవసరం లేదు కేవలం ఈ తీర్మానానికి అనుకూలంగా 9 ఓట్లు వస్తే చాలట.

అయితే ఈ ప్రయత్నాలపై చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.అమెరికా చర్యతో ‘మసూద్‌’ సమస్య పరిష్కారం కాక పోగా, మరింత క్లిష్టమవుతుందని,ఇలా తీర్మానాన్ని బలవంతంగా ఆమోదించేలా చేయడం కాకుండా ఏకాభిప్రాయం సాధించాలని అమెరికాని, చైనా కోరినట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube