మొన్న ఫైజర్.. ఇప్పుడు మోడెర్నా: యూఎస్‌లో టీకా తీసుకున్న వారిలో అలర్జీ

ప్రపంచం కోవిడ్‌తో అల్లాడుతున్న వేళ బయటకి వచ్చిన కొన్ని రకాల టీకాలు మనిషిలో ఆశలు కల్పిస్తున్నాయి.ఎంతో ఆశతో అవి తీసుకుంటున్న వారిలో దుష్ప్రభావాలు వెలుగు చూస్తున్నాయి.

 Us Doctor Has Severe Allergic Reaction To Moderna Vaccine, Vaccine Side Effects,-TeluguStop.com

కొద్దిరోజుల క్రితం అమెరికాలోని అలాస్కాలో ఫైజర్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న ఆరోగ్య కార్యకర్తలో అలర్జీ లక్షణాలు కనిపించాయని ఆరోగ్య అధికారులు వెల్లడించారు.ప్రస్తుతం ఆమె హాస్పిటల్‌లో పరిశీలనలో ఉన్నారు.

అమెరికాలో కొవిడ్‌ టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే.బ్రిటన్‌లో గతవారం ఈ తరహాలోనే రెండు కేసులు వెలుగు చూడగా.

ఇద్దరు కోలుకున్నారు.

దీంతో

అనాఫిలాక్సిన్‌ లక్షణాలు

ఉన్న వారు వ్యాక్సిన్‌ తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

పలు నిర్దిష్ట ఔషధాలు, ఆహార పదార్ధాలు తదితరాల వల్ల అలెర్జీ తలెత్తే పరిస్థితిని అనాఫిలాక్సిస్‌ అంటారు.ఈ సమస్య ఉన్నవారు ఫైజర్‌-బయో ఎంటెక్‌ వ్యాక్సిన్‌ తీసుకోవద్దని బ్రిటన్‌ మెడికల్‌ రెగ్యులరేటర్‌ సూచించింది.

తాజాగా అమెరికాకే చెందిన మరో సంస్థ మోడెర్నా తయారు చేసిన టీకా తీసుకున్న ఓ వైద్యుడికి తీవ్ర అలర్జీ లక్షణాలు కనిపించినట్లు అమెరికన్ మీడియా కథనాలు ప్రచురించింది.

Telugu Alaska Pfizer, Boston Medical, Germa Vaccine, Moderna Vaccine, Pfizerbio,

ఇటీవల బోస్టన్ మెడికల్ సెంటర్‌కు చెందిన జెరియాట్రిక్‌ ఆంకాలజీ వైద్యుడు హొస్సీన్ సదర్జాదేహ్‌ మోడెర్నా టీకా వేయించుకున్నారు.ఆ వెంటనే తనకు తీవ్ర ప్రతిస్పందనలు కలిగాయని ఆయన తెలిపారు.మైకం , గుండె వేగంగా కొట్టుకున్నట్లు అనిపించిందని హోస్సీన్ తెలిపారు.

మోడెర్నా టీకా అమెరికా వ్యాప్త పంపిణీ ప్రారంభమైన తరవాత వెలుగులోకి వచ్చిన తొలి కేసు ఇదే.దీనిపై బోస్టన్ మెడికల్ సెంటర్ ప్రకటన విడుదల చేసింది.సదర్జాదేహ్‌కి వచ్చిన అలర్జీకి సంబంధించి చికిత్స చేయించుకున్నారని తెలిపింది.ఆయనను అత్యవసర విభాగానికి తరలించి అనారోగ్యానికి దారితీసిన కారణాలను విశ్లేషించామని.ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే వుందని చెప్పింది.మరోవైపు మోడెర్నా, ఫైజర్‌ టీకాల రియాక్షన్‌కు సంబంధించి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ విచారణ జరుపుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube