అమెరికాలో ఈ డాక్టర్ ఘాతుకం..ఎంత మందిని చంపాడో తెలుసా

అమెరికాలో ఓ డాక్టర్ పైశాచికత్వం దాదాపు 25 మంది ప్రాణాలు తీసింది.ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకి అధిక డోసేజ్ కలిగిన డ్రగ్స్ ఇచ్చి వారి చావుకు కారణం అయ్యాడు ఆ డాక్టర్.

 Us Doctor Charged With Murdering 25 Patients Using Fentanyl Overdose-TeluguStop.com

ఒహాయోలోని మౌంట్ కార్మెల్ ఆసుపత్రిలో పని చేస్తున్న విలియమ్స్ అనే డాక్టర్ అక్కడ అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఫెంటనైల్ అనే డ్రగ్ ఇవ్వడంతో వారు దుర్మరణం చెందారు.

ఇదిలాఉంటే దేశవ్యాప్తంగా అనేక ఆసుపత్రులలో అధిక డోసేజ్ ఇవ్వడం వలన 2017లోనే 47,600 మంది రోగులు చనిపోయినట్టుగా అప్పట్లోనే డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధికారులు గుర్తించారు.

దాంతో అప్పటి నుంచీ డాక్టర్లపై నిఘా పెట్టడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.అయితే విలియమ్స్ 2015 ఫిబ్రవరి 25 నుంచి 2018 నవంబరు వరకూ కూడా అదే ఆసుపత్రిలో విధులు నిర్వహించినట్టుగా తెలుస్తోంది.

అప్పట్లో ఈ హత్యలు ఇతని వల్లే జరిగాయా అనే అనుమానాలని వ్యక్తం చేస్తున్నారు అధికారులు.

అమెరికాలో ఈ డాక్టర్ ఘాతుకంఎం

విలియమ్స్ ని 2018 లో స్పస్పెండ్ చేయగా, ఆరు నెలల పాటు విచారణ ఈ కేసుపై జరుగుతూనే ఉంది.విలియమ్స్ చేసిన ఈ ఘటనకి జడ్జ్ ఆశ్చర్యపోయి ఇతడికి ఎలాంటి శిక్ష విధించినా తప్పులేదు అంటూ వ్యాఖ్యానించారట.తన కెరియర్ లో ఇలాంటి కేసు చూడలేదని జడ్జ్ చెప్పడం గమనార్హం.

ఒక వేళ విలియమ్స్ తన నేరాన్ని అంగీకరిస్తే 15 ఏళ్ళు శిక్ష పడే అవకాశం ఉందని అంటున్నారు అధికారులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube