హెచ్ 1 బీ వీసాల జారీపై తాత్కాలిక నిషేధం: ట్రంప్‌కు కోర్టులో ఎదురుదెబ్బ

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న టైంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.హెచ్ 1 బీ వీసాలతో సహా వర్కింగ్ వీసాల జారీని తాత్కాలికంగా రద్దు చేస్తూ ఈ ఏడాది జూన్‌లో ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు నిలువరించింది.

 Us Judge Blocks Donald Trump's H-1b Visa Ban, Donald Trump's H-1b Visa Ban, Fede-TeluguStop.com

ఈ మేరకు ట్రంప్ ఉత్తర్వులను రద్దు చేస్తూ నార్తర్న్ కాలిఫోర్నియా జిల్లా న్యాయమూర్తి జస్టిస్ జెఫ్రీ వైట్ గురువారం ఆదేశాలు జారీచేశారు.
వీసాలపై ట్రంప్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అమెరికా ఉత్పత్తిదారుల జాతీయ సమాఖ్య, యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, జాతీయ రిటైల్ ఫెడరేషన్, టెక్‌నెట్‌ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశాయి.

ఇందులో వాణిజ్య విభాగం, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీలను ప్రతివాదులుగా పేర్కొన్నాయి.విచారణ సందర్భంగా ఆర్థిక పునరుద్ధరణ, వృద్ధి ఆవిష్కరణలు అవసరమైన సమయంలో తమకు అధ్యక్షుడు అడ్డంకులు కల్పించారని ఆ సంస్థలు కోర్టు దృష్టికి తీసుకొచ్చాయి.
వీరి వాదనను పరిగణనలోనికి తీసుకున్న జెఫ్రీ వైట్ ఆ ఆదేశాలను అడ్డుకుంటూ తీర్పు వెలువరించారు.అంతేకాకుండా ట్రంప్ తన రాజ్యాంగ అధికారాన్ని మించిపోయారని ఆయన వ్యాఖ్యానించారు.

ఇమ్మిగ్రేషన్ విషయంలో వలసేతర విదేశీయుల ఉపాధికి దేశీయ విధానాన్ని రూపొందించడంలో అధ్యక్షుడికి హద్దులేని అధికారాన్ని కాంగ్రెస్ ఇవ్వదు.అటువంటి చర్యలు ఆర్టికల్-2 అధికారాలను అతిక్రమించడమేనని జడ్జి వైట్ తన 25 పేజీల ఉత్తర్వుల్లో వ్యాఖ్యానించారు.

రెండు శతాబ్దాలకు పైగా ఆర్టికల్ -1 శాసన, న్యాయ వ్యవస్థ అనుసరించే విధానాలను తెలియజేస్తోందని న్యాయమూర్తి అన్నారు.ఇమ్మిగ్రేషన్ విధానాన్ని నిర్ణయించే అధికారం రాజ్యాంగం ప్రకారం కాంగ్రెస్‌కు ఉంది.

అధ్యక్షుడికి లేదని స్పష్టం చేశారు.
ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, అభివృద్ధి, ఆవిష్కరణల్లో కీలకమైన నిపుణుల నియామాకాలను నిరోధించే వీసా నిషేధంపై ఈ తీర్పు తక్షణమే అమల్లోకి వస్తుందని నేషనల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ పేర్కొంది.

కరోనా వైరస్ సంక్షోభంతో ఉద్యోగాలు కోల్పోయిన స్థానికులను ఆదుకోడానికి హెచ్-1బీ వీసాలను ఈ ఏడాది డిసెంబరు వరకు నిషేధిస్తున్నట్టు ట్రంప్ జూన్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే, ట్రంప్ నిర్ణయాన్ని ఐటీ, ఇతర సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

సంక్షోభ సమయంలో వీసాలపై నిషేధం విధించడం వల్ల ఆర్ధిక వ్యవస్థ మరింత దిగజారుతుందని, నైపుణ్యం ఉన్నవారు దొరకడం కష్టమని పేర్కొంటూ పలువురు కోర్టును ఆశ్రయించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube