ఇదెక్కడి న్యాయం...అమెరికా కోర్టు తీర్పుపై మండిపడుతున్న తల్లితండ్రులు..!!

అమెరికాలో జరిగిన ఓ సంఘటన.ఆ సంఘటన తాలూకు కోర్టు తీర్పు అమెరికా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.ఓ తండ్రి తన కొడుకు బాగుకోసం చేసిన ఓ పనికి సదరు కొడుకు కోపంతో కోర్టుకు వెళ్తే కోర్టు కొడుకుకు అనుకూలంగా తీర్పు ఇస్తూ తండ్రికి రూ.55 లక్షల ఫైన్ వేసింది.అసలు విషయం తెలిసితే ఇంకా షాక్ అవుతారు.ఇంతకీ మ్యాటర్ ఏమిటంటే.అమెరికాలోని మిచిగాన్ చెందిన బెల్, పార్క్ ల కొడుకు డేవిడ్ ఇంట్లో కూర్చుని అశ్లీల సినిమాలు చూడటమే పనిగా పెట్టుకున్నాడు.

 Us Court Shocking Judgement On Father And Son Case, Us Court ,judgement, Father,-TeluguStop.com

డేవిడ్ వద్ద సుమారు 1600 పోర్న్ సీడీలు ఉన్నాయి.

వీటిని చూడటమే డేవిడ్ పని.మూడేళ్ళ క్రితం తన భార్యకు విడాకులు ఇచ్చిన డేవిడ్ తల్లి తండ్రుల వద్దే ఉంటున్నాడు.ఈ క్రమంలోనే అతడు అశ్లీల వీడియో సీడీలు చూడటమే పనిగా పెట్టుకున్నాడు.డేవిడ్ ప్రవర్తనతో విసిగిపోయిన తండ్రి అతడు ఎక్కడ చెడిపోతాడోనని భయపడి కొడుకు లేని సమయంలో ఆ సీడీలు అన్నిటిని ధ్వంసం చేసేశాడు.

ధ్వంసం చేసిన సీడీలను ఫోటో తీసి కొడుకుకు ఈ మెయిల్ రూపంలో పంపాడు.

నువ్వు ఆ అశ్లీల సీడీలు చూసి తప్పుదారి పడుతున్నావు, ఇవి నీకు అంత మంచివి కాదు కాబట్టి నేను వీటిని ధ్వంసం చేశాను, నీకు ఎంతో మేలు చేశాను నువ్వు పోర్న్ సీడీలకు బానిస కాకూడదు అని ఈ మెయిల్ చేశాడు.ఈ మెయిల్ చూసుకున్న కొడుకు ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయాడు, తండ్రి చేసిన ఈ పనికి నేను ఎంతో నష్టపోయాను నాకు పరిహారం ఇప్పించండి అంటూ రూ.55 లక్షల రూపాయల మేరకు తండ్రిపై కోర్టులో దావా చేశాడు.అయితే కోర్టు మేజర్ అయిన కొడుకు వైపే తీర్పు చెప్పింది.కొడుకు అడిగిన డబ్బులు కట్టాల్సిందేనని తీర్పు చెప్పింది.దాంతో షాక్ అయిన తండ్రి తన కొడుకు క్షేమం కోసమే అలా చేశానని తెలిపినా కోర్టు అనుమతించలేదు.పరిహారం కట్టాల్సిందేనని తేల్చి చెప్పింది.

ఇదిలాఉంటే కోర్టు తీర్పుపై అమెరికన్స్ మండిపడుతున్నారు.తండ్రి కొడుకు బాగుకోసం మంచిపని చేస్తే మానవతా కోణంలో తీర్పు ఇవ్వాకుండా ఇలాంటి తీర్పు ఇస్తారా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube