అమెరికాలో భారీ మోసం..ఇద్దరు భారతీయుల కీలక పాత్ర..!!

అమెరికన్ల ని మోసం చేసి ఏకంగా 500 కోట్లని కాజేసిన ఘటన అమెరికాలో కలకలం సృష్టిస్తోంది.

అయితే ఈ మోసానికి పాల్పడిన వ్యక్తులని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు.

అయితే ఈ యువకుల్లో ఇద్దరు ప్రవాస భారతీయులు ఉండటం గమనార్హం.ఆ వివరాలలోకి వెళ్తే.

మోహిత్ దేవేంద్రభాయ్ శర్మ, కునాల్ జగదీశ్‌భాయ్ శర్మ అనే ఇద్దరు వ్యక్తులు గుజరాత్ కేంద్రంగా ఓ కాల్ సెంటర్ నడుపుతున్నారు.కెనడాకి చెందిన జూలియట్ బెల్లె అనే వ్యక్తి తో కలిసి అమెరికెన్ల వివరాలు సేకరించడం మొదలు పెట్టారు.

ఇలా అన్ని వివరాలు తెలుసుకున్న తరువాత వారికి ఫోన్ చేసి.

Advertisement

తాము అమెరికా రెవెన్యూ విభాగం నుంచీ ఫోన్ చేస్తున్నామని పన్నులు సరిగా కట్టలేదని ఇలా అయితే చర్యలు తీసుకుంటామని బెదిరించారు.ఇలా మొత్తం 15 వేలమందిని మోసం చేసిన ఈ ముగ్గురు.దాదాపు 500 కోట్లు కాజేశారు.

ఈ మోసాన్ని గుర్తించిన అమెరికా అధికారులు ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు