హెచ్1బీ వీసా: ఏళ్ల నాటి విధానం రద్దు, యూఎస్‌సీఐసీకి కోర్టు మొట్టికాయలు

హెచ్1 బీ వీసాలను తిరస్కరించడానికి యూనైడెట్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ ఉపయోగిస్తున్న దశాబ్ధాల నాటి ప్రక్రియను అమెరికా కోర్టు రద్దు చేసింది.ఇటీవల సంవత్సరాలలో అమెరికా కంపెనీలతో పోలీస్తే భారతీయ టెక్ కంపెనీలకే హెచ్1బీ దరఖాస్తుల తిరస్కరణ రేటు ఎక్కువగా ఉంది.

 Us Court Has Scrapped A Decade Old Process Used By The Uscis To Deny H 1b Visas-TeluguStop.com

సాంకేతిక కార్మికులకు వర్క్ పర్మిట్లను ఆలస్యం చేయడానికి లేదా తిరస్కరించడానికి, ఉద్యోగి-యజమాని సంబంధాన్ని నెలకొల్పడానికి యూఎస్‌సీఐఎస్ 2010 నుంచి ఉపయోగిస్తున్న ‘‘న్యూఫెల్డ్ మెమో’’ చెల్లదని డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాకు చెందిన యూఎస్ కోర్టు స్పష్టం చేసింది.అలాగే పెండింగ్‌లో ఉన్న అన్ని పిటిషన్లపై 60 రోజుల్లోగా చర్యలు తీసుకోవాల్సిందిగా సదరు ఏజెన్సీని కోర్టు ఆదేశించింది.

హెచ్1బీ మంజూరు కోసం క్లయింట్ వర్క్ అసైన్‌మెంట్లను సమర్పించాల్సిందిగా పిటిషనర్లను అడగలేమని యూఎస్‌సీఐఎస్ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది.అయితే మూడేళ్ల కాలానికి వర్క్ పర్మిట్ అనుమతులను తిరస్కరించడానికి గల కారణాన్ని తెలపాలని కోర్టు కోరింది.

మరోవైపు ఇలాంటి నిర్ణయాలు చాలా కాలం పాటు చెల్లాయని, అయితే యూఎస్‌సీఐఎస్ తన హద్దులు దాటిందని యజమానులతో పాటు న్యాయవ్యవస్థ అంగీరిస్తోందని ఐటీ సర్వ్ అలయన్స్-2020 జాతీయాధ్యక్షుడు అమర్ వరదా అన్నారు.సుమారు 1,250 మంది సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఈ అలయన్స్‌లో ఐటీ సిబ్బంది, ఐటీ సంస్థలు ఉన్నాయి.

ఇందులోని సభ్యులు గూగుల్‌, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి సంస్థలతో సహా అనేక దిగ్గజాలతో 5 బిలియన్ డాలర్ల వ్యాపారం చేస్తారని ఆయన చెప్పారు.

వాస్తవానికి, వీసా నిరాకరణలను సవాలు చేస్తూ గత రెండేళ్లుగా ఐటీ సర్వ్ సభ్యులు 130కి పైగా కేసులు దాఖలు చేశారు.

తాజాగా ఈ కోర్టు తీర్పు తర్వాత పెండింగ్‌లో ఉన్న అన్ని పిటిషన్లు ఆమోదించబడతాయని ఐటీ సర్వ్ ఆశిస్తోంది.ఐటీ కన్సల్టింగ్ కంపెనీలపై యూఎస్‌సీఐఎస్ చేస్తున్న దాడిని కోర్టు తిరస్కరించడం చూసి తాము సంతోషిస్తున్నామన్నారు ఐటీసర్వ్ కోసం పిటిషన్ వేసిన న్యాయసేవా సంస్థ వాస్డెన్ బనియాస్ భాగస్వామి బ్రాడ్ బనియాస్.హెచ్1బీ కార్యక్రమంలో ప్రాథమికంగా మార్పులు చేసేందుకు యూఎస్‌సీఐఎస్ చేస్తున్న ప్రయత్నాలకు కోర్టు ఆదేశం చెంప పెట్టుగా ఆయన అభివర్ణించారు.

Telugu Visas, Telugu Nri, Scrappeddecade, Uscis-Telugu NRI

యూఎస్ కేంద్రంగా పనిచేస్తున్న థింక్ ట్యాంక్, నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ, యూఎస్‌సీఐఎస్ డేటాపై ఇటీవల జరిపిన అధ్యయనంలో, ఇతర కంపెనీలకు కన్సల్టింగ్ సేవలను అందించే సంస్థలకు హెచ్1బీ తిరస్కరణ రేటు 2019 ఆర్ధిక సంవత్సరానికి 30 శాతం ఉందని తేలింది.చెల్లుబాటు అయ్యే యజమాని-ఉద్యోగి సంబంధం ఏర్పడలేదనే కారణంతో యూఎస్‌సీఐఎస్ పెద్ద సంఖ్యలో హెచ్1బీ దరఖాస్తులను నిరాకరించింది.దీనిని ఐటీ సర్వ్ చట్టవిరుద్ధమని వాదిస్తూ వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube