టెక్సాస్‌కు ఊరట.. మహిళలకు షాక్: అబార్షన్‌పై నిషేధాన్ని సమర్ధించిన యూఎస్ ఫెడరల్ కోర్ట్

అబార్షన్‌లపై టెక్సాస్ తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా మహిళలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అమెరికా ఫెడరల్ కోర్ట్ శుక్రవారం కీలక తీర్పును వెలువరించింది.

 Us Court Allows Texas To Resume Ban On Most Abortions , Texas‌, U.s. District-TeluguStop.com

గర్భస్రావాలపై టెక్సాస్ విధించిన నిషేధాన్ని కొనసాగించవచ్చని ఆదేశించింది.ఐదవ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ నిర్ణయాన్ని న్యాయస్థానం తోసిపుచ్చింది.

బుధవారం యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి రాబర్ట్ పిట్మన్ టెక్సాస్ చట్టం అమలును నిలిపివేస్తూ ప్రాథమిక నిషేధాన్ని జారీ చేశారు.ఇది 1973 నాటి రోయ్ వి వేడ్‌ కేసులో సుప్రీంకోర్ట్ తీర్పును ఉల్లంఘించడమేనని ఇది గర్భస్రావంపై మహిళలకు వున్న చట్టపరమైన హక్కును అణచివేయడమేనని న్యాయమూర్తి అన్నారు.

టెక్సాస్ అటార్నీ జనరల్ కెన్ పాక్స్‌టన్ ఈ నిర్ణయాన్ని ఫెడరల్ కోర్టులో అప్పీల్ చేశారు.అయితే న్యాయస్థానం తీర్పు అనంతరం పాక్స్‌టన్ ట్విట్టర్ ద్వారా హర్షం వ్యక్తం చేశారు.

‘‘గర్భస్రావం’’ పై టెక్సాస్ తీసుకొచ్చిన చట్టం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.దీని ప్రకారం ఆరు వారాల పిండాన్ని గర్భస్రావం చేసుకోవడం చట్టవిరుద్ధం.చట్టం ఉల్లంఘించిన కేసులను కోర్టుల వరకూ తీసుకొచ్చినవారికి రివార్డును అందించే నిబంధనలు కూడా ఇందులో ఉన్నాయి.ప్రస్తుతం అమెరికాలో ఈ చట్టం చర్చనీయాంశం అయ్యింది.

సెప్టెంబర్ 1 నుంచి అబార్షన్ హక్కును టెక్సాస్ రద్దు చేసింది.స్త్రీ కడుపులో బిడ్డ గుండె కొట్టుకోవడం ప్రారంభించిన తరువాత గర్భస్రావం చేయించుకోకూడదని అక్కడి ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది.

ఈ నిబంధనలు అతిక్రమించిన వైద్యులు, లేదా ఇతర వ్యక్తులు ఎవరైనా అబార్షన్‌ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఈ చట్టం వెసులుబాటు కల్పిస్తోంది.దీనిని రద్దు చేయాలంటూ ఆ దేశ సుప్రీంకోర్టులో అనేక మంది పిటిషన్లు వేశారు.

అయితే ఆ పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది.మరోవైపు మిస్సిస్సిపీ రాష్ట్రంలో 15 వారాల తరువాత మహిళలు అబార్షన్ చేయించుకోకూడదనే చట్టం ఉంది.

దానిపై డిసెంబర్ 1న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

Telugu America, Supreme, Texas, Judgerobert, Washington-Telugu NRI

అయితే, కొత్త చట్టాన్ని సమర్థిస్తున్నవారు కూడా లేకపోలేదు.ప్రారంభంలో కొంతమంది నిరసనకారుల ర్యాలీని అడ్డగించారు.అమాయక ప్రాణుల రక్తంతో నీ చేతులు తడుస్తున్నాయి అని గుంపులో ఒక వ్యక్తి నినాదాలు చేశాడు.

కానీ, నిరసనకారుల పాటలు, చప్పట్ల ప్రవాహంలో ఆయన అరుపులు కొట్టుకుపోయాయని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక కథనాన్ని ప్రచురించింది.కడుపులో బిడ్డలను కాపాడడమే ఈ చట్టం లక్ష్యమని సమర్థకులు అంటున్నారు.

ఇతర రిపబ్లికన్ ఆధిపత్య రాష్ట్రాల్లోని ప్రభుత్వవాలు ఈ అబార్షన్ చట్టాన్ని అమలుచేసే ఆలోచనలో ఉన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube