Satwant Singh Beant Singh: 1984 సిక్కు అల్లర్ల బాధితులకు యూఎస్ కాంగ్రెస్ సభ్యుడి నివాళులు

1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితులకు అమెరికా కాంగ్రెస్ సభ్యుడు డోనాల్డ్ నోర్‌క్రాస్ నివాళులర్పించారు.నాటి హింసాకాండలో బాధితులైన వారి వారసత్వాన్ని సౌత్ జెర్సీలో కొనసాగిస్తున్న సిక్కు సోదరులు, సోదరీమణులకు సంఘీభావంగా తాను ఇక్కడ నిలబడి వున్నానని ప్రతినిధుల సభలో డోనాల్డ్ వ్యాఖ్యానించారు.

 Us Congressman Expresses Solidarity For 1984 Anti-sikh Riot Victims , Us Congres-TeluguStop.com

ఈ సందర్భంగా సౌత్ జెర్సీ సిక్కు సమాజానికి ఆయన సంఘీభావం తెలిపారు.భారతదేశంలో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగి ఈ ఏడాదికి 38 సంవత్సరాలు పూర్తవుతుందని నోర్‌క్రాస్ పేర్కొన్నారు.

డెమొక్రాట్ పార్టీకి చెందిన డోనాల్డ్ నోర్‌క్రాస్ న్యూజెర్సీలోని ఫస్ట్ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.ఊచకోత ఘటన తర్వాత చాలా మంది సిక్కులు భారత్ నుంచి పారిపోయి అమెరికాకు వలస వచ్చారని ఆయన గుర్తుచేశారు.

వీరిలో ఎక్కువ మంది సౌత్ జెర్సీని హోమ్‌గా మార్చుకున్నారని.అంతేకాకుండా ఈ ప్రాంత విద్య, ఆర్ధిక రంగాల అభివృద్ధితో పాటు సాంస్కృతిక వైవిధ్యానికి దోహదపడ్డారని డోనాల్డ్ పేర్కొన్నారు.

ఇకపోతే.గత నెలలో 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లు ఆధునిక భారత చరిత్రలో ‘‘చీకటి సంవత్సరం’’ అని వ్యాఖ్యానించారు అమెరికన్ సెనేటర్, అమెరికన్ సిక్కు కాంగ్రెషనల్ కాకస్ సెభ్యుడు పాట్ టూమీ.సెనేట్ ఫ్లోర్‌లో ఆయన మాట్లాడుతూ.భారత్‌లోని జాతుల మధ్య చోటు చేసుకున్న అనేక హింసాత్మక సంఘటనలను ఈ ప్రపంచం చూసిందన్నారు.వీటిలో సిక్కు అల్లర్లు కూడా ఒకటని పాట్ వ్యాఖ్యానించారు.పంజాబ్ ప్రావిన్స్‌లోని సిక్కులు .భారత్‌లోని కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేశారని ఆయన గుర్తుచేశారు.1984 నవంబర్‌లో భారత్ వ్యాప్తంగా దాదాపు 3000 మందికిపైగా సిక్కు పురుషులు, మహిళలు, పిల్లలను ఊచకోత కోయడంతో పాటు లెక్కలేనన్ని అత్యాచారాలు జరిగాయని పాట్ వెల్లడించారు.

Telugu Americansikh, Beant Singh, Satwant Singh-Telugu NRI

కాగా.1984 అక్టోబరు 31న అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీని.ఆమె బాడీగార్డులైన సత్వంత్‌ సింగ్‌, బీయాంత్‌ సింగ్‌ కాల్చి చంపారు.ఇందిర హత్యతో దేశం ఉడికిపోయింది.ఈ హత్యకు ప్రతీకారంగా పలు చోట్ల సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగాయి.దేశ రాజధాని ఢిల్లీతో పాటు చాలా ప్రాంతాల్లో సిక్కులను ఊచకోత కోశారు.

ఆస్తుల ధ్వంసం, మహిళలు, బాలికలపై అత్యాచారాలు, దోపిడిలతో అల్లరి మూకలు బీభత్సం సృష్టించాయి.ఈ అల్లర్లలో దాదాపు 2800 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారిక లెక్కలు చెబుతున్నా.

ఈ సంఖ్య భారీగానే వుంటుందని అంచనా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube