అమెరికా లో ప్రవాసీయులకు అమెరికా కాంగ్రెస్ గుడ్ న్యూస్  

Us Congress Votes On Green Card Bill-reduce The Agonising,us Congress,us House Of Representative,work Permanently In Us,అమెరికా,గ్రీన్ కార్డులు

గత కొన్నేళ్లుగా అమెరికా లో శాశ్వత నివాసం కోసం పరితపిస్తున్న ప్రవాసీయులకు అక్కడి అమెరికా కాంగ్రెస్ గుడ్ న్యూస్ అందించింది. విదేశీ వృత్తి నిపుణులు అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉంటూ ఉద్యోగం చేసుకునేందుకు ఉద్దేశించిన ‘గ్రీన్ కార్డు’ల జారీపై గరిష్ట పరిమితిని ఎత్తివేస్తూ అమెరికా కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో దేశానికి గరిష్టంగా 7 శాతం గ్రీన్ కార్డులు మాత్రమే జారీచేయాలన్న నిబంధనను ఎత్తివేయాలని అమెరికా సెనెట్ లో బిల్లును ప్రవేశపెట్టగా, దీనికి సెనెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం ఇకపై ప్రతిభ ఆధారంగానే విదేశీయులకు గ్రీన్ కార్డులు జారీచేయనున్నారు..

అమెరికా లో ప్రవాసీయులకు అమెరికా కాంగ్రెస్ గుడ్ న్యూస్ -US Congress Votes On Green Card Bill

ఒక్కో దేశానికి గరిష్టంగా 7 శాతానికి మించి గ్రీన్ కార్డులు ఇవ్వరాదన్న ప్రస్తుత నిబంధలను సడలిస్తూ ఇప్పుడు 15 శాతానికి పెంచేందుకు వీలు కల్పిస్తూ తాజాగా బిల్లు ప్రవేశ పెట్టగా,దానికి సెనేట్ ఆమోదం తెలిపింది. దీనితో ఇక అమెరికా లో శాశ్వత నివాసానికి, జాబ్ చేసుకునేందుకు వలసదారులకు వీలు కల్పించే విధంగా ఈ బిల్లు ఉపయోగపడనుంది. అయితే ఇది మరి ముఖ్యంగా భారతీయులకు శుభ వార్తగా చెప్పొచ్చు. గతంలో ఉన్న నిబంధనల నేపథ్యంలో జనాభా ఎక్కువ ఉన్న దేశాలకు, తక్కువ ఉన్న దేశాలకు ఒకే రకమైన రూల్స్ అమలవుతుండడం తో భారత్, చైనా,ఫిలిప్పీన్స్ కు చెందిన వలసదారుల దరఖాస్తులు అలా పేరుకుపోయి ఉండేవి.

అయితే హెచ్-1బీ వీసాలతో అమెరికాకు వఛ్చి గ్రీన్ కార్డు కోసం ఏళ్ళ తరబడి ఎదురుచూస్తున్న భారతీయులకు ఈ బిల్లు ఆమోదం వల్ల ఎంతో ప్రయోజనం కలగనుంది. ప్రస్తుత విధానం ప్రకారం. భారతీయుల అప్లికేషన్లన్నీ ఆమోదానికి నోచుకోవాలంటే సుమారు 70 ఏళ్ళు పడుతుందని అంచనా. అలాంటిది ఇప్పుడు ఈ బిల్లు ఆమోదం పొందడం తో ప్రవాసీయులు ఊపిరి పీల్చుకున్నారు.

ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డుల్లో పరిమిత కోటాను ఎత్తివేయడంతోబాటు ఫ్యామిలీ స్పాన్సర్డ్ విభాగంలో 15 శాతానికి పెంచేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తోంది. ఈ తాజా బిల్లు పై భారత్ కూడా హర్షం వ్యక్తం చేసింది.