ఇద్దరు భారత సంతతి ప్రముఖులకు యూఎస్ కాంగ్రెస్ నివాళులు

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లేవారికి అమెరికాయే తొలి డెస్టినేషన్.అలా శతాబ్ధాలుగా ఎన్నో జాతులు, వర్గాలు, మతాల వారిని అక్కున చేర్చుకుంది అమెరికా.

 Us Congress Pays Tribute To Two Indian-origin Dignitaries, Chara Jith Singh,  Pr-TeluguStop.com

తనపర బేధాలు లేకుండా అందరికీ ఆశ్రయం కల్పించింది.జీవన ప్రమాణాలు, ఆరోగ్య వసతులు, ఉపాధి, విద్య ఇలా అన్నింట్లో మెరుగ్గా వుండటంతో వివిధ దేశాల ప్రజలకు అమెరికా అంటే వ్యామోహం నానాటికీ పెరుగుతోంది.

అన్ని రకాలుగా ప్రోత్సహం లభించడంతో పాటు అగ్రరాజ్యంలోని అత్యున్నత పదవులను విదేశీ పౌరులు చేజిక్కించుకుంటున్నారు.సమర్ధత, మేధస్సు, అనుభవం వుంటే చాలు అమెరికన్లు అందలమెక్కిస్తున్నారు.

ఇందుకు ఎన్నో ఉదాహరణలు.భారతీయులు, చైనీయులు, కొరియన్లు, జపనీయులు, ఆఫ్రికా ఖండాల వారు అక్కడ రాణిస్తున్నారు.

ఇక భారతీయులను అమెరికన్లు ఎంతగానో ప్రేమిస్తారు.కష్టాల్లో వున్న మనవారిని ఎందరో ఆదుకున్నారు.

ఫైండ్ రైజింగ్ కార్యక్రమాల్లోనూ స్థానిక అమెరికన్లు చేయూతనందిస్తారు.తాజాగా ఇటీవల మరణించిన ఇద్దరు భారతీయ అమెరికన్ల ప్రముఖులకు అమెరికా కాంగ్రెస్ నివాళులర్పించింది.

వారు కాలిఫోర్నియాకు చెందిన చరణ్‌జిత్ సింగ్, న్యూజెర్సీకి చెందిన ప్రీతమ్ సింగ్ గ్రెవాల్.

చరణ్‌జిత్ సింగ్ మే 12న కన్నుమూశారు.ఆయన విజయవంతమైన వ్యాపారవేత్తగా, సెంట్రల్ వ్యాలీ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు.1950లో భారత్‌లో జన్మించిన చరణ్‌జిత్ సింగ్ 1988లో పంజాబ్‌లోని లూధియానా నుంచి అమెరికాకు వలస వచ్చారు.ఆయన కుటుంబం కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లో స్ధిరపడింది.2003లో ఆయన కాలిఫోర్నియాలోని ఫ్రెస్నోకు మారాడు.సెంట్రల్ వ్యాలీలో చరణ్‌జిత్ సింగ్ ఎన్నో వ్యాపారాలను అభివృద్ధి చేశాడు.ఆయనకు 30కి పైగా గ్యాస్ స్టేషన్లు, లిక్కర్ దుకాణాలు వున్నాయని కాంగ్రెస్ సభ్యుడు జిమ్ కోస్టా తన సంతాప సందేశంలో తెలిపారు.

సమయానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చే చరణ్ ఏకకాలంలో దుకాణాలను నిర్వహించడంతో పాటు అతని కుటుంబంతో కూడా గడిపేవాడని ఆయన చెప్పాడు. సిక్కు సమాజం గురించి ఆయన తరచుగా ఆలోచించేవాడని జిమ్ కోస్టా అన్నారు.

Telugu Amarajith, Josh, Paystribute, Preethasingh, Congress, Conress-Latest News

ఇక ప్రీతం సింగ్ గ్రెవాల్‌‌ సేవలను గుర్తుచేసుకున్నారు కాంగ్రెస్ సభ్యుడు జోష్ గోట్హైమర్.గ్లెన్ రాక్ సిక్కు గురుద్వారా వ్యవస్థాపక సభ్యుడిగా, ప్రీతమ్.నార్త్ జెర్సీ సిక్కు సమాజం కలిసి పూజలు చేయడానికి సురక్షితమైన స్థలాన్ని నిర్మించడంలో సహాయపడ్డారని ఆయన అన్నారు.తాను వ్యక్తిగతంగా ఈ గురుద్వారాను అనేకసార్లు సందర్శించిన తరువాతే, ప్రీతమ్ సింగ్ గొప్పదనం అర్ధమైందని జోష్ పేర్కొన్నారు.

సమాజానికి నాణ్యమైన విద్యను అందించాలన్న ఉద్దేశ్యంతో ఫెయిర్ లీ డికిన్సన్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీగా పనిచేశారని ఆయన గుర్తుచేశారు.తన సోదరుడు అమర్‌జిత్‌తో కలిసి తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం రామాపో కాలేజీలో హర్‌చంద్ సింగ్, జాగీర్ కౌర్ మెమోరియల్‌ స్కాలర్‌షిప్‌ను నెలకొల్పాడని గోట్హైమర్ చెప్పారు.

హాకెన్‌సాక్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌లో మంచి గుర్తింపు వుందని ఆయన చెప్పారు.ప్రీతమ్ ఇప్పుడు మన మధ్య లేనప్పటికీ.ఆయన వారసత్వం నార్త్ జెర్సీపై ఎప్పటికీ ఉంటుందని జోష్ అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube