క్లైమేట్ ఛేంజ్, ఆరోగ్యం‌పై కీలక బిల్లుకు యూఎస్ కాంగ్రెస్ ఆమోదం.. బైడెన్‌కు పెద్ద విజయమే

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాజకీయంగా కీలక విజయం సాధించారు.బైడెన్ యంత్రాంగం తీసుకొచ్చిన వాతావరణం, పన్ను, ఆరోగ్య సంరక్షణ ప్రణాళికకు సంబంధించిన బిల్లును శుక్రవారం అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది.

 Us Congress Passes Climate, Health Bill; Big Win For Biden , Speaker Nancy Pelos-TeluguStop.com

ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ టై బ్రేక్ ఓటు వేయడంతో సెనేట్‌లో ఈ బిల్లు ఆమోదం పొందగా.ఆ వెంటనే ప్రతినిధుల సభలో సునాయసంగా బిల్లు పాసయ్యింది.2030 నాటికి అమెరికాలో గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను 40 శాతం తగ్గించే లక్ష్యంతో 370 బిలియన్ డాలర్ల పెట్టుబడికి సంబంధించిన తన ప్రణాళికను బైడెన్ గతంలోనే ప్రకటించారు.

ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే బైడెన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

‘నేడు అమెరికన్ ప్రజలు గెలిచారు’’ అంటూ ట్వీట్ చేశారు.ద్రవ్యోల్బణం తగ్గింపు చట్టం ఆమోదం పొందడంతో .ఇకపై కుటుంబాలు తక్కువ ప్రిస్క్రిప్షన్ మందుల ధరలు, తక్కువ ఆరోగ్య సంరక్షణ ఖర్చులను చూస్తాయి.వచ్చే వారం చట్టంగా సంతకం చేయడానికి నేను ఎదురుచూస్తున్నానని బైడెన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

నవంబర్‌లో జరిగే కీలకమైన మధ్యంతర ఎన్నికలకు మూడు నెలల ముందు , కాంగ్రెస్‌పై డెమొక్రాటిక్ పార్టీ నియంత్రణతో పాటు బైడెన్ తన అగ్ర విధాన ప్రాధాన్యతలలో ఒకదానిపై ఇది స్పష్టమైన విజయంగా అమెరికన్ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.కార్బన్ ఉద్గారాలను తగ్గించే పోరాటంలో అమెరికా నాయకత్వాన్ని పునరుద్ధరించడంలో ఈ బిల్లు సహాయపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Telugu Biden, Big Win Biden, Nancy Pelosi, Congress, Joe Biden-Telugu NRI

అంతకుముందు అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ మాట్లాడుతూ.మన కుటుంబాలు అభివృద్ధి చెందడానికి, మన గ్రహం మనుగడలో వుండేలా చూసే క్షణానికి అనుగుణంగా వుండేలా ఖర్చు తగ్గించే ప్యాకేజీగా ఆమె అభివర్ణించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube