ఉద్యోగులకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన బాస్... చూడగానే షాక్

ఒక కంపెనీ అభివృద్ధిలో పెట్టుబడి పెట్టి, సంస్థని స్థాపించిన బాస్ ఆలోచనలు ఎంత ముఖ్యమో, ఆ ఆలోచనలని ముందుకి తీసుకెళ్ళి అభివృద్ధిలోకి తీసుకెళ్ళగలిగే ఉద్యోగుల ప్రాముఖ్యం అంతే ఉంటుంది.ఉద్యోగులు లేకుండా ఎ కంపెనీ వృద్ధిలోకి రాదు.

 Us Company Gives Employees Christmas Bonus-TeluguStop.com

ఒక ఆలోచన ఎన్నో శిఖరాలు అధిరోహించాలంటే కచ్చితంగా ఉద్యోగులే కీలకంగా ఉండాలి.అయితే అలాంటి ఉద్యోగులని కార్పోరేట్ కంపెనీలు కేవలం పనివాళ్ళుగా మాత్రమే చూస్తాయి.

వేతనానికి రెట్టింపు పని చేపించుకుంటాయి.వారి సామర్ధ్యాన్ని కేవలం తమ కంపెనీ అభివృద్ధికి ఉపయోగించుకుంటాయి తప్ప అతనిని ఎప్పుడు గుర్తించే పని చేయవు.

అయితే అమెరికాలో ఓ కంపెనీలోలో పని చేసే రెండు వందల మంది ఉద్యోగులకి కంపెనీ ఏండీ ఊహించని బహుమతి ఇచ్చి అందరిని సర్ప్రైజ్ చేశారు.

అమెరికాలోని మేరీలాండ్‌లో సెయింట్ జాన్ ప్రాపర్టీస్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు వారి యజమాని ఎడ్వార్డ్ సెయింట్ జాన్ ఓ టార్గెట్ పెట్టాడు.

ఆ టార్గెట్‌ను ఉద్యోగులు అతితక్కువ సమయంలోనే పూర్తి చేసేశారు.దీంతో ఉద్యోగులకు మర్చిపోలేని గిఫ్ట్ ఇవ్వాలని ఎడ్‌వార్డ్ నిశ్చయించుకున్నాడు.

క్రిస్ట్‌మస్ సమీపిస్తుండటంతో.కంపెనీ స్టాఫ్ మొత్తానికి పార్టీ ఇచ్చాడు.

పార్టీలో డిన్నర్ టేబుల్‌పై ప్రతి ఒక్క ఉద్యోగి కోసం ఓ ఎరుపు రంగు ఎన్వలప్ కవర్‌ను పెట్టాడు.ఆ కవర్ తెరిచి చూసిన ఉద్యోగులంతా ఒక్కసారిగా షాకయ్యారు.

ఒక్కొక్క ఎన్వలప్ కవర్‌లో 35 లక్షలకు పైగా విలువ చేసే చెక్కులు పెట్టారు.ఇలా కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కలిపి ఏకంగా 93 కోట్లకు బోనస్ గా ఇచ్చారు.

దీంతో ఉద్యోగులు తమ బాస్ ఇచ్చిన ఫెస్టివల్ బోనస్ గా సంబరాలు చేసుకున్నారు.దీనిపై ఎడ్వార్డ్ మాట్లాడుతూ వారి వలన ఈ రోజు తన కంపెనీ, తాను ఈ స్థాయిలో ఉన్నాను.

అందుకే ఈ ఎదుగుదలలో భాగమైన వీరికి సర్ప్రైజ్ ఇవ్వాలని ఇలా ప్లాన్ చేసాను అని చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube