వలస వాసులపై అమెరికా దాడులు..  

Us Closes Major Crossing As Caravan Migrants Mass At Border In Mexico-migrants Mass

అమెరికా లోకి ప్రవేశించడానికి వేల సంఖ్యలో వలసదారులు వారి కుటుంబాలతో అమెరికా, మెక్సికో సరిహద్దుల్లో ఎదురుచూస్తున్నారు. అయితే వలస విధానాలని ముందు నుంచి వ్యతిరేకిస్తున్న ట్రంప్ వారి కుటుంబాలను వెనక్కి తరిమికొట్టేందుకు అమెరికా సైన్యాన్ని మరింతగా పెంచి, సరిహద్దుల్లో వలసదారులు కంచె దాటి లోపలికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో శరణార్థులపై అమెరికా సైన్యం కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొడక్షన్ దళాలు దాడులకు పాల్పడుతున్నారు..

వలస వాసులపై అమెరికా దాడులు..-US Closes Major Crossing As Caravan Migrants Mass At Border In Mexico

అత్యంత రద్దీగా ఉండే పశ్చిమ సరిహద్దుల్లో రోజుకు దాదాపు 90 వేల మంది ప్రజలు సరిహద్దులను దాటడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది…తమ భూభాగంలోకి చొరబడడానికి సిద్ధంగా ఉన్న సుమారు 6 వేల మంది శరణార్థులపై అమెరికా దాడులకు పాల్పడటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది అయితే వలసదారులు సరిహద్దులకు కొద్దిదూరంలోనే ఒక ఖాళీ ప్రదేశం లో బస ఏర్పాటు చేసుకున్నారు.

కాని అక్కడ వారికి కనీస ఆహారం నీటి సౌకర్యం లేకపోవడంతో వారిలో తీవ్ర అసహనం పెరిగిపోతోంది ఇదిలా ఉంటే.శరణార్థులపై దాడులు చేయడం అమెరికాలో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది అధికార రిపబ్లికన్ ప్రతిపక్ష పార్టీలు ఒకరినొకరు ఈ అంశంపై ఆరోపణలు చేసుకుంటున్నారు..