పీకల్లోతు కష్టాల్లో ట్రంప్...క్యాపిటల్ దాడి ఘటనలో కీలక ఆధారం..!!

అమెరికా అధ్యక్షుడిగా తన పదవిని వీడే ముందే ఎలాంటి అధ్యక్షుడైనా ఎంతో హుందాగా నడుచుకుంటారు.ఎలాంటి నిరాసక్తత ఉన్నా ఆ సమయంలో ఎలాంటి విద్వేషాలు లేకుండా అమెరికా సాంప్రదాయ రాజకీయాలకు అనుగుణంగా హుందాగా వీడ్కోలు చెబుతారు.

 Us Capitol Rioters Blames Trump, Donald Trump, Us Capitol Building Attack, Joe B-TeluguStop.com

కాని ట్రంప్ వీటికి భిన్నంగా వ్యవహరించారు.అమెరికా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అమెరికా క్యాపిటల్ భవనంపై దాడి ఘటన అందరిని విస్తు పోయేలా చేసింది.

అయితే ఈ ఘటనకు ప్రధాన కారకుడు ట్రంప్ అంటూ అభిశంసన కూడా ప్రవేశ పెట్టిన విషయం అందరికి తెలిసిందే.అయితే

ఫిబ్రవరి 8 వ తేదీన అభిశంసన కు సంభందించి విచారణ జరగనుంది.

ట్రంప్ పై శాశ్వత నిషేధం దిశగా ఈ అభిశంసన ఉండనుంది.ట్రంప్ పై ఈ అభిశంసన తప్పకుండా ఆమోదం పొందుతుందని ట్రంప్ రాజకీయ జీవితానికి చెక్ పడినట్టేనని నిపుణులు అంటున్నారు.

ఇదిలాఉంటే.క్యాపిటల్ దాడి ఘటనలో కీలకమైన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అతడి పేరు జాక్సన్, అతడి వయసు 20.ఈ దాడి ఘటన వివరాలను అతడి నుంచీ విచారించిన పోలీసులకు అతడు విస్తు పోయే విషయాలు వెల్లడించాడట.

Telugu America, Donald Trump, Joe Biden, Presidential, Capitol Attack, Capitolri

పోలీసులు విచారణ తరువాత కోర్టు ముందు జాక్సన్ హాజరయ్యాడు.ట్రంప్ ఇచ్చిన పిలుపుకు నేను ఆకర్షితుడిని అయ్యాయని జడ్జి ముందు వెల్లడించాడు.ట్రంప్ చేసిన ఉద్వేగభరితమైన ప్రసంగం ద్వారా మాత్రమే తాను ఈ దాడికి పాల్గోన్నాని, తనతో పాటు చాలామంది ఇలానే దాడికి వచ్చారని అతడు తెలిపాడు.జాక్సన్ ఉద్దేశ పూర్వకంగా ఈ దాడిలో పాల్గొనలేదని ట్రంప్ కారణంగానే అతడు ఈ దాడికి పాల్పడ్డాడని అతడిని విడుదల చేయాలని కోర్టును కోరారు.

అయితే ఒక పక్క అభిశంసనతో చిక్కుల్లో పడ్డ ట్రంప్, మరో పక్క జాక్సన్ వాంగ్మూలంతొ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో వేచి చూడాల్సిందే.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube