ట్రంప్ ఎఫెక్ట్...ఆమెకి అవార్డు కట్..!!  

Us Cancels Journalist\'s Award Over Her Criticism Of Trump-jessikka Aro,journalist Award

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వంలో పని చేసే అధికారులు ఎవరైనా తన మాట వినకపోయినా , విమర్శలు చేసినా రెండు మూడు రోజుల్లో వారిపై బదిలీ వేటో , లేక వారిని ఆ పదవి నుంచీ తప్పించడమో జరిగిపోతుంది. గతంలో శ్వేత సౌధంలో జర్నలిస్ట్ తనని ఇబ్బంది కర ప్రశ్నలు సంధిస్తే ఏకంగా ఆ పత్రిక మొత్తాన్ని వైట్ హౌస్ లోకి ఎంట్రీ లేకుండా చేశాడు ట్రంప్ తాజాగా..

ట్రంప్ ఎఫెక్ట్...ఆమెకి అవార్డు కట్..!!-US Cancels Journalist's Award Over Her Criticism Of Trump

ట్రంప్ పై తన వార్తా కధనాలతో విమర్శలు గుప్పించిన ఓ ఫిన్నిష్‌ జర్నలిస్టు జెస్సికా.గతంలో ప్రతిపాదించిన అవార్డు ని అమెరికా రద్దు చేసింది.

ధైర్యవంతులైన మహిళలకు సంబంధించిన పరిశోధనాత్మక కథనాలను వెలువరించిన కృషికి ఈ జర్నలిస్టుకు పురస్కారాన్ని ప్రతిపాదించినప్పటికీ

తుది జాబితాలో ఉన్న ఆమె పేరుని చివరి నిమిషంలో తప్పించారు. అయితే ఈ తొలగింపుకు వివరణ ఇచ్చింది. తాము పొరపాటు పడి ఈ జర్నలిస్టు పేరును జాబితాలో చేర్చామని ఇది తమ తప్పిదం అంటూ వివరణ ఇచ్చింది.