అమెరికా: నల్లజాతీయుడిపై పోలీసుల దాష్టీకం.. పక్షవాతం వుందని చెప్పినా కనికరించకుండా

అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ భారీ విగ్రహం స్వేచ్ఛ, సమానత్వానికి ప్రతీకగా నిలుస్తుంది.జాతి, మతం, ప్రాంతం, రంగు వంటి వివక్ష లేకుండా దేశ ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు, దేశంలోని ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా బతికేందుకు ఈ ప్రతిమ పూచీకత్తు వహిస్తుంది.

 Us Black Paraplegic Dragged From Car Calls Dayton Ohio Police Inhumane-TeluguStop.com

కానీ ఆచరణలో ఇది అంతా ఎండమావిగానే కనిపిస్తుందన్నది విజ్ఞుల మాట.ఓ ప్రయోజనం, ఓ సంకల్పం నుంచి పుట్టిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ దేశంలోని ఈ వివక్షను కళ్ళప్పగించి చూడటం మినహా ఏమీ చేయలేకపోతోంది.ఇది అమెరికా సమాజానికి తలవంపులు తెచ్చే వ్యవహారమే.

అగ్రరాజ్యంగా, ప్రపంచ పెద్దన్నగా, అత్యంత సంపన్న దేశమైన అమెరికాలో నల్లజాతీయుల పట్ల నేటీకీ వివక్ష కొనసాగుతుండటం సిగ్గుచేటు.

 Us Black Paraplegic Dragged From Car Calls Dayton Ohio Police Inhumane-అమెరికా: నల్లజాతీయుడిపై పోలీసుల దాష్టీకం.. పక్షవాతం వుందని చెప్పినా కనికరించకుండా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

శతాబ్దాలుగా అమెరికా సమాజంలో భాగమైన నల్లజాతీయులు నేటీకీ అక్కడ ద్వీతీయశ్రేణి పౌరులుగా జీవిస్తున్నారనడానికి ఎన్నో ఉదాహరణలు.ఇక గతేడాది జరిగిన జార్జి ఫ్లాయిడ్ హత్య అయితే నిలువెత్తు నిదర్శనం.

ఫ్లాయిడ్‌ను ఓ తెల్లజాతి పోలీసు కర్కశంగా హతమార్చిన తీరు సమాజాన్ని నివ్వెరపరిచింది.ఈ ఘటనను యావత్ ప్రపంచం నిరసించింది.

న్యూయార్క్, కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా, జార్జియా, ఇల్లినాయిస్, నార్త్ కరోలినా, మిచిగాన్, మేరీలాండ్, లూసియానా, తదితర రాష్టాల్లో నల్లజాతీయులు అధికసంఖ్యలో ఉన్నారు.

జార్జ్ ఫ్లాయిడ్ ఘటనకు ఈ మధ్యే ఏడాది పూర్తయ్యింది.

ఈ నేరానికి పాల్పడిన పోలీసు అధికారి ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్నాడు.ఈ ఘటన మరిచిపోకముందే మరో నల్లజాతీయుడిపై పోలీసులు అమానవీయంగా బలప్రయోగం చేశారు.

తనకు పక్షవాతం ఉందని, కారు దిగలేనని చెప్పినా వినకుండా.నల్లజాతీయుడిని కారులోంచి లాగిపడేశారు.

ఒహియో రాష్ట్రంలోని డేటన్‌లో గత నెల 30న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి ప్రకంపనలు సృష్టిస్తోంది.ఈ ఘటన మొత్తం పోలీసుల బాడీ క్యామ్‌లో రికార్డ్ అయింది.

Telugu America, Assassination Of George Floyd, By Clifford Owens, California, Florida, Georgia, Illinois, New York, North Carolina, Ohio, Police \\'inhumane\\', Statue Of Liberty, Texas, Us: Black Paraplegic Dragged From Car Calls Dayton-Telugu NRI

వివరాల్లోకి వెళితే.సెప్టెంబర్ 30న క్లిఫర్డ్ ఒవెన్స్ బై (39) అనే నల్లజాతీయుడు తన కార్‌లో ఇంటికి వెళ్తుండగా డేటన్ పోలీసులు ఆపారు.డ్రగ్స్ తనిఖీలు చేయాలని, ఇందుకోసం కారు దిగి సహకరించాలని పోలీసులు క్లిఫర్డ్‌ను ఆదేశించారు.అయితే, తాను పెరాలిసిస్ వ్యాధిగ్రస్తుడినని కారు దిగలేనని బదులిచ్చాడు.అయితే, అతడు తప్పించుకోవడాని అబద్ధాలు చెబుతున్నాడని అనుమానించిన పోలీసులు క్లిఫర్డ్ మాటలను ఏ మాత్రం పట్టించుకోలేదు.అంతేకాదు కారు దిగుతావా లేదా అని హుకుం జారీ చేశారు.

అయినప్పటికీ క్లిఫర్డ్ నుంచి స్పందన లేకపోవడంతో సహనం నశించిన పోలీసులు అతడిని జుట్టు పట్టి కారులోంచి బయటకు లాగేశారు.చేతులు, కాళ్లు కట్టేసి కారును చెక్ చేశారు.

అనంతరం కారులో 22,450 డాలర్ల సొమ్ము తప్ప డ్రగ్స్ ఏవీ దొరకలేదని పోలీసులు ప్రకటించడం వివాదాస్పదమైంది.ఓ నల్లజాతీయుడిపై, అందులోనూ ఓ పక్షవాత రోగిపై ఏమాత్రం కనికరం లేకుండా పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దీంతో నాడు విధుల్లో వున్న పోలీసులపై ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.

కాగా, మినెసోటా రాష్ట్రంలోని మినియాపోలిస్ నగరంలో జార్జ్ ఫ్లాయిడ్ (46) అనే ఓ నల్ల జాతి వ్యక్తిని పోలీసులు అరెస్టు చేస్తుండగా చనిపోయిన సంగతి తెలిసిందే.2020 మే 25న జరిగిన ఈ ఘటన కారణంగా అమెరికాలోని అనేక నగరాలు రగిలిపోయాయి.ఫ్లాయిడ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మెడపై గట్టిగా నొక్కిపట్టడంతో అతని ఊపిరాడక మరణించాడు.

తనకు ఊపిరాడటం లేదని ఫ్లాయిడ్‌ అరుస్తున్నా పట్టించుకోకుండా పోలీసులు క్రూరంగా వ్యవహరించినట్లు వైరల్ అయిన వీడియోలలో ఉంది.ఈ క్రమంలో జార్జ్‌ఫ్లాయిడ్ ఆక్సిజన్ అందకే మరణించాడని వైద్యుడు తెలిపారు.

వివాదాస్పద పోలీస్ అధికారి డెరెక్ చౌవిన్ మోకాలు అతని మెడపై ఉండటం వల్ల అతను ఊపిరి ఆడక ప్రాణాలు వదిలాడని డాక్టర్ వాంగ్మూలం ఇచ్చారు.దీంతో చౌవిన్‌కు 22.5 ఏళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం.

#Ohio #Clifd Owens #Georgia #Texas #North Carolina

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు