పిల్లలపై అత్యాచారాలు, వేధింపులు.. భారతీయ దర్యాప్తు సంస్థలకు అమెరికన్ ఏజెన్సీ సాయం

భారత్‌లో పిల్లలపై లైంగిక వేధింపులు, అత్యాచారాల ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే.నేరస్తులు.

 Us-based Agency Is Helping India For Check Child Sex Abuse, Pornography , National Center For Missing And Exploited Children In America, Us Based Centralized Reporting System, Ncrb-TeluguStop.com

పోలీసుల నుంచి తప్పించుకోవడానికి రకరకాల మార్గాలను అనుసరిస్తూ వుండటంతో దర్యాప్తుకు అవరోధాలు ఎదురవుతున్నాయి.ఈ క్రమంలో ఇతర దేశాల నుంచి భారతీయ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థలు సహాయాన్ని కోరుతున్నాయి.

ఈ కోవలోనే అమెరికన్ ఏజెన్సీ భారత్‌కు సాయం చేస్తోంది.యూఎస్ ఆధారిత సెంట్రలైజ్డ్ రిపోర్టింగ్ సిస్టమ్‌ను వినియోగించి చైల్డ్ పోర్నోగ్రఫీ, చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులను డీల్ చేయడంతో పాటు నేరస్తులను పట్టుకోవడానికి ఉపయోగిస్తున్నామని భారతీయ అధికారులు చెబుతున్నారు.

 US-based Agency Is Helping India For Check Child Sex Abuse, Pornography , National Center For Missing And Exploited Children In America, US Based Centralized Reporting System, NCRB-పిల్లలపై అత్యాచారాలు, వేధింపులు.. భారతీయ దర్యాప్తు సంస్థలకు అమెరికన్ ఏజెన్సీ సాయం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమెరికాలోని నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లోయిటెడ్ చిల్డ్రన్ (ఎన్‌సీఎంఈసీ) రూపొందించిన లక్షకు పైగా టిప్‌లైన్ రిపోర్టులను యాక్సెస్ చేయడం వల్ల దేశవ్యాప్తంగా పెరుగుతోన్న చైల్డ్ పోర్నోగ్రఫీ, పిల్లల లైంగిక వేధింపుల కేసులను తనిఖీ చేయడానికి వెసులుబాటు కలిగిందన్నారు.ఎవరైనా ఒక వ్యక్తి నేరానికి సంబంధించి లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు ప్రత్యేక నెంబర్ లేదా వెబ్‌సైట్ ద్వారా సలహాలను అందించినప్పుడు అది ఆటోమేటిగ్గా ‘‘టిప్‌లైన్ నివేదిక’’గా మార్పు చెందుతుంది.

కాలర్‌ పేరును లేదా మరేదైనా గుర్తింపును ఏజెన్సీలు ఎప్పుడూ అడగవు.

పిల్లలపై నేరాలకు సంబంధించి యునైటెడ్ స్టేట్స్ సెంట్రలైజ్డ్ రిపోర్టింగ్ సిస్టమ్ అయిన ఎన్‌సీఎంఈసీ.

మూడేళ్ల క్రితం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ)తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.ఈ టిప్‌లైన్ నివేదికలను భారత్‌తో పంచుకుంటోంది.

చైల్డ్ పోర్నోగ్రఫీ, పిల్లలపై లైంగిక వేధింపుల కేసులను ఎదుర్కోవడంలో పోలీసులు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థలు సాధిస్తున్న విజయాలలో ఎన్‌సీఎంఈసీ టిప్‌లైన్ నివేదికలు చాలా సహాయపడుతున్నాయని హోంమంత్రిత్వ శాఖ అధికారి ఒకరు జాతీయ మీడియాతో అన్నారు.

Telugu Ncrb, Pornography, Agencyindia-Telugu NRI

స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రకారం.చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన కంటెంట్ ఎన్‌సీఎంఈసీ దృష్టికి.హెల్ప్‌లైన్‌ల ద్వారా , ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా, ఇన్‌ఫార్మార్‌ల ద్వారా, ఇన్‌పుట్ ఏజెన్సీ ద్వారా చేరుకుని అనుమానితుడి లోకేషన్‌ని గుర్తిస్తారు.

అప్పుడు టిప్‌లైన్ రిపోర్ట్ రూపొందించబడి, భారత్‌లోని ఎన్‌సీఆర్‌బీకి అందుబాటులోకి వస్తుంది.దీనిని స్వీకరించిన అనంతరం ఎన్‌సీఆర్‌బీ.రాష్ట్ర పోలీసు అధికారులకు సమాచారాన్ని పంపుతుంది.అక్కడి నుంచి వ్యక్తిగత పోలీసు అధికార పరిధికి మళ్లిస్తారు.2021 చివరి నాటికి భారత్ నుంచి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయబడిన చైల్డ్ పోర్నోగ్రఫీ, పిల్లలపై లైంగిక వేధింపుల కంటెంట్‌పై ఎన్‌సీఎంఈసీ నుంచి లక్షకు పైగా టిప్‌లైన్ నివేదికలు అందినట్లుగా తెలుస్తోంది.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube