అమెరికాలో రెడ్డీస్ కి అనుకూల తీర్పు..   US Appeals Court Allows Dr Reddy's Labs To Sell Generic Suboxone     2018-11-26   16:40:19  IST  Surya

అమెరికాలో వ్యాపారం చేస్తూ ఎంతో మంది భారతీయులు ఉన్నత స్థాయిలని అధిరోచించారు..ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలలో ప్రారంభం అయ్యి విశ్వవ్యాప్తంగా తన కంపీన ఔషదాలకి మాంచి డిమాండ్ తెచ్చుకుని అగ్రగామి ఫార్మా కంపెనీగా ఎదిగిన డాక్టర్ రెడ్డీస్ కి విపరీతమైన ఆదరణ లభిస్తోంది తాజాగా అమెరికా కోర్టు ఇచ్చిన తీర్పుతో డాక్టర్ రెడ్డీస్ కి భవిష్యత్తులో కోట్లు తెచిపెట్టి మరింత గా కంపెనీ విలువను పెంచనుంది..

అసలు విషయం ఎమింటంటే..మార్ఫిన్‌, ఆక్సికోడైన్‌, ఫెంటానిల్, బుప్రెనార్ఫైన్‌ వంటి మత్తు మందులకు బానిసలుగా మారిన వారు అమెరికాలో ఎంతో మంది ఉన్నారు అయితే ఆ వ్యసనం నుంచీ బయట పడటానికి ఉపయోగపడే సుబోగ్జోన్‌ జనరిక్‌ ఔషధాన్ని అమెరికాలో విక్రయించటానికి హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ కి అమెరికా కోర్టు అంగీకారం తెలిపింది..దీనిపై అమెరికాలో అప్పీల్స్‌ కోర్టు నుంచి డాక్టర్‌ రెడ్డీస్‌కు అనుకూలమైన తీర్పు వెలువడింది.

US Appeals Court Allows Dr Reddy's Labs To Sell Generic Suboxone-Generic Suboxone

కోర్టు ప్రకటనతో ఇప్పుడు రెడ్డీస్ ఈ ఔషధాన్ని విక్రయించేందుకు చర్యలు చేపట్టిందని డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ వెల్లడించింది. అమెరికాలో ఈ ఔషదాన్ని విడుదల చేయగలిగితే..దీనిపై ఈ ఆర్థిక సంవత్సరంలో 50-60 మిలియన్‌ డాలర్ల అమ్మకాలను నమోదు చేయగలుగుతుందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి..మొత్తానికి ఓ తెలుగు ఔషద కంపెనీ అమెరికాలో సంచలనం సృష్టిస్తోందని చెప్పడం లో సందేహం లేదని చెప్పాలి..

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.