భారత్ కు మరో భారీ సాయం అందించిన అగ్ర రాజ్యం...!!!

కరోనా మహమ్మారి కారణంగా సమస్యలు ఎదుర్కుంటున్న భారత్ కు అగ్ర రాజ్యం అమెరికా మరో సారి ఆపన్న హస్తం అందించదానికి సిద్దమయ్యింది.మహమ్మారి దెబ్బకు భారత్ ఆర్ధికంగా తీవ్ర నష్టాన్ని చవి చూడటమే కాకుండా లెక్కకు మించిన పాజిటివ్ కేసుల కారణంగా వెంటిలేటర్స్, వైద్య పరికరాలు ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్న నేపధ్యంలో అమెరికాలోని భారతీయ ఎన్నారైల చొరవతో కరోనా సెకండ్ వేవ్ సమయంలో కోట్లాది రూపాయల వైద్య పరికరాలు, వ్యాక్సిన్ ముడి సరుకు పంపి సాయం అందించింది.

 Us Anncounce 41 Million Dollors Donate To India, Ventilators, Medical Equipment-TeluguStop.com

అయితే భారత్ లో పరిస్థితులు అదుపులోకి వస్తున్న క్రమంలో థర్డ్ వేవ్ సమీపిస్తుందన్న హెచ్చరికల నేపధ్యంలో మరో సారి సాయం అందించేందుకు అమెరికా సిద్దమయ్యింది.భారత్ లో నెలకొన్న క్రిష్ల పరిస్థితులను ఎదుర్కోవడానికి దాదాపు 41 మిలియన్ డాలర్ల సాయం చేయనున్నట్లుగా ప్రకటించింది.

గతంలో 100 మిలియన్ డాలర్ల సాయం అందించగా తరువాత దాదాపు 50 మిలియన్ డాలర్ల వైద్య పరికరాలు మందులు అందించింది.

Telugu Aid, Oxygen, Ventilators, Corona Wave, Indian Nris, Medical-Telugu NRI

అంతేకాక భారత్ కు సుమారు 25 మిలియన్ డాలర్లు విలువ చేసే కరోనా వ్యాక్సిన్ డోసులు పంపుతామని ప్రకటించారు అధ్యక్షుడు బిడెన్.అమెరికా- భారత్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఫౌండేషన్ సైతం దాదాపు 1.2 మిలియన్ డాలర్లు పంపడమే కాకుండా 120 వెంటిలేటర్లు, 1000 ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ లు పంపేందుకు సిద్దమయ్యింది.ప్రస్తుతం అమెరికా చేయనున్న 41 మిలియన్ డాలర్ల సాయాన్ని కేవలం కరోనా నిర్మూలనకు, అలాగే కోవిడ్ టెస్టింగ్, కరోనా వలన కలిగే మెంటల్ హెల్త్ సర్వీస్ మెడికల్ సర్వీసులకు గాను ఖర్చు చేయనున్నారట.తాజాగా అమెరికా ఇవ్వనున్న ఈ 41 మిలియన్ డాలర్లు గతంలో అందించిన సాయానికి కలిపితే దాదాపు 200 మిలియన్ డాలర్లు భారత్ కు అమెరికా సాయం అందించినట్టుగా తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube