డ్రెస్ కోడ్‌లో మార్పులు చేసిన యూఎస్ ఎయిర్‌ఫోర్స్: సిక్కులకు ఊరట  

Us Air Force Updates Dress Code To Accommodate Sikh-americans - Telugu Air Force, Dress Code, Nri News, Sikh-americans, Telugu Nri, Us,

తమ వద్ద పనిచేస్తున్న వివిధ దేశాల పౌరుల మతవిశ్వాసాలను గౌరవించేలా అమెరికన్ ఎయిర్‌ఫోర్స్ డ్రస్ కోడ్ విధానంలో మార్పులు చేసింది.ఎయిర్‌ఫోర్స్ ఫిబ్రవరి 7న ఖరారు చేసిన కొత్త యూనిఫామ్ నిబంధనల ప్రకారం ఎయిర్‌మెన్ల మత విశ్వాసాల ఆధారంగా వారి వస్త్రధారణ, తదితర ప్రమాణాలను రూపొందించింది.

Us Air Force Updates Dress Code To Accommodate Sikh-americans

ఇందుకు సంబంధించి 0-6 స్థాయి కమాండర్లు ఎయిర్‌మెన్ అభ్యర్థనను 30 రోజులలోపు (యూఎస్ వెలుపల వసతి కోరితే 60 రోజులు) ఆమోదించాలని నిర్దేశించింది.ఒకసారి కనుక అధికారుల అనుమతి లభిస్తే సదరు ఎయిర్‌మెన్‌కు కెరీర్ మొత్తం ఇదే నిబంధనలు వర్తిస్తాయి.

భద్రతాపరమైన కారణాల వల్ల మతపరమైన హక్కులకు అనుమతించబడని కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ ఈ విధానం ఉపయుక్తంగానే ఉందని సిక్కు సమాజం ఒక ప్రకటనలో తెలిపింది.

సిక్కులు అమెరికా సాయుధ దళాలతో పాటు ప్రపంచంలోని ఇతర మిలిటరీలలోనూ గౌరవప్రదంగా, సమర్థవంతంగా సేవలందిస్తున్నారు.సిక్కు-అమెరికన్లందరూ మిలటరీలోని ప్రతి శాఖలోనూ డ్రెస్ కోడ్ గురించిన ప్రకటన కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.ఇప్పుడు యూఎస్ ఎయిర్‌ఫోర్స్ సమానత్వం, మత స్వేచ్ఛను గౌరవించే దిశగా గొప్ప ముందడుగు వేసిందని సిక్కు సమాజానికి చెందిన న్యాయవాది గిసెల్లె క్లాప్పర్ తెలిపారు.

సిక్కు కూటమి ప్రకారం… ఎయిర్ నేషనల్ గార్డ్‌గా అర్హత సాధించిన సిక్కు-అమెరికన్ గుర్‌చేతన్ సింగ్.ఇందుకు సంబంధించి 2019 సెప్టెంబర్‌లో అనుమతులు వచ్చాయి.త్వరలో ఆయన సైబర్ ట్రాన్స్‌పోర్ట్‌లో సాంకేతిక శిక్షణకు వెళ్లనున్నారు.

తాజా వార్తలు