మిత్రుడన్నాడు మళ్లీ అనుమానాలేంటీ: భారత్‌పై అంతుచిక్కని అమెరికా వైఖరి

అమెరికా ఏ దేశంతో గొడవ పెట్టుకున్నా.మిత్రుడంటూ చేయి చాచినా దాని వెనుక ఎన్నో ఆర్ధిక, సామాజిక కారణాలు ఉంటాయి.

 Us Accuses Vietnam Of Currency Manipulation, Adds India, Taiwan, Thailand To Wat-TeluguStop.com

రూపాయి లాభం లేనిదే అగ్రరాజ్యం ఎలాంటి స్టెప్ తీసుకోదు.గడిచిన పది పదిహేనేళ్లుగా భారతదేశం రష్యాను కాదని, అమెరికాకు దగ్గరవుతోంది.

అటు వైట్ హౌస్ సైతం చైనాను కట్టడి చేయడానికి భారత్‌కు ఎనలేని ప్రాధాన్యతనిస్తోంది.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం అప్పుడప్పుడు భారత్‌పై నోరుపారేసుకున్నా.

కొన్ని సార్లు అనుకూలంగా మాట్లాడుతూ వచ్చారు.ప్రధాని నరేంద్ర మోడీ తనకు అత్యంత విశ్వసనీయ మిత్రుడంటూ పలు మార్లు వ్యాఖ్యానించారు.

అయితే ఇప్పుడు మనదేశం పట్ల అమెరికాకు కొత్త అనుమానం పుట్టుకొచ్చింది.కరెన్సీ విలువలో ఉద్దేశపూర్వకంగా మార్పిడీలకు పాల్పడతాయనే అనుమానం ఉన్న దేశాల జాబితాలో భారత్‌ను చేర్చింది.ఈ లిస్ట్‌లో భారత్‌ను చేర్చడం ఇది రెండోసారి.2018 మే నెలలో యూఎస్ తొలిసారిగా భారత్‌ను పరిశీలన జాబితాలో చేర్చింది.గతేడాది ఈ లిస్ట్‌ నుంచి తొలగించిన అగ్రరాజ్యం మళ్లీ ఇప్పుడు చేర్చడం గమనార్హం.కరెన్సీ విలువను మారుస్తాయనే దేశాలను అమెరికా తన ‘‘ పరిశీలనల జాబితా’’లో ఉంచుతుంది.

ఇండియాతో పాటు ఈ లిస్ట్‌లో చైనా, జపాన్‌, దక్షిణకొరియా, జర్మనీ, ఇటలీ, సింగపూర్‌, మలేషియా, తైవాన్, థాయ్‌లాండ్, వియత్నాం, స్విట్జర్లాండ్‌లు ఉన్నాయి.మరోవైపు ఐర్లాండ్‌ను ఈ జాబితాను తొలగిస్తున్నట్లు అమెరికా ఆర్ధిక శాఖ ప్రకటించింది.

Telugu Donald Trump, Indiaamerica, Joe Biden, Kamala, Narendra Modi, Rashya Indi

తమ దేశంతో ప్రధాన వాణిజ్య భాగస్వామ్యం కలిగి ఉన్న దేశాల్లో కరెన్సీ అవకతవకలపై అమెరికా దృష్టిపెట్టి ఈ నిర్ణయం తీసుకుంది.మరోవైపు విదేశీ క్రయవిక్రయాల ప్రకటనలో భారత్ సుదీర్ఘకాలంగా చూపిస్తున్న పారదర్శకతను అమెరికా ఆర్ధిక శాఖ ఈ సందర్భంగా స్వాగతించింది.సాధారణంగా చాలా దేశాలు తమ ఎగుమతులు పెంచుకోవడానికి కరెన్సీ విలువను తగ్గిస్తూంటాయి.ఇందుకోసం అందుబాటులో ఉన్న రకరకాల మార్గాలను ఎంచుకుంటాయి.ఈ చర్యల కారణంగా ఆయా దేశాల్లో వస్తువులు చౌకగా దొరుకుతాయి.అయితే ఇది ఇతర దేశాల వ్యాపారాలను దెబ్బతీస్తుంది.

ఇక భారత్‌కు అమెరికా రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా వున్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube