Urvasivo rakshasivo movie review : ఊర్వసివో రాక్షసివో రివ్యూ: రొమాన్స్ తో అదరగొట్టిన అల్లు శిరీష్!

అల్లు శిరీష్, అను ఇమ్మానియేల్ జంటగా నటించిన సినిమా ఊర్వసివో రాక్షసివోఈ సినిమాకు డైరెక్టర్ రాకేష్ శశి దర్శకత్వం వహించాడు.రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరపైకి వచ్చింది.

 Urvasivo Rakshasivo Movie Review And Rating Details Here Urvasivo Rakshasivo , A-TeluguStop.com

ఇక ఇందులో సునీల్, వెన్నెల కిషోర్, ఆమని, కేదర్ శంకర్ తదితరులు నటించారు.జి ఏ టు పిక్చర్స్ బ్యానర్ పై ధీరజ్ మొగిలినేని, ఏం విజయ్ ఈ సినిమాకు నిర్మాతలుగా చేశారు.

ఈ సినిమాకు అచ్చు రాజమణి మ్యూజిక్ అందించాడు.తన్వీర్ సినిమాటోగ్రఫీ అందించాడు.

అయితే ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ట్రైలర్, లుక్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.ఇక ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాగా ఎటువంటి హిట్టు టాక్ ను సొంతం చేసుకుందో చూద్దాం.

కథ:

ఇక ఈ సినిమా కథ ఏంటంటే.ఇందులో అల్లు శిరీష్ శ్రీ కుమార్ పాత్రలో కనిపిస్తాడు.

ఇతడు ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి.ఇక ఇతడికి పెళ్లి చేయాలని అతని తల్లితండ్రులు బాగా ప్రయత్నం చేస్తూ ఉంటారు.

ఇక శ్రీ కుమార్ కు మరోవైపు తన ఆఫీసులో సింధు అను ఇమ్మానియేల్ ఎదురు పడుతుంది.ఇక తనను ప్రేమలో పడేయటానికి బాగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు.

రకరకాలుగా ఇంప్రెస్ చేయడం కోసం ప్రయత్నిస్తాడు.దాంతో సింధు కూడా శ్రీ కుమార్ కు పడుతుంది.

ఒక అతనితో బాగా క్లోజ్ గా మూవ్ అవుతుంది.కానీ చివరికి నిన్ను ఫ్రెండ్ గా మాత్రమే చూసాను అని చెప్పి షాక్ ఇస్తుంది.

దీంతో శ్రీ కుమార్ ఎలా రియాక్ట్ అవుతాడు.చివరికి ఏం జరుగుతుంది అనేది మిగిలిన కథలోనిది.

Telugu Allu Shirish, Anu Emmanuel, Vijay, Review, Rakesh Shashi-Movie

నటినటుల నటన:

అల్లు శిరీష్ మాత్రం బాగా అదరగొట్టాడు.రొమాంటిక్ సీన్స్ లో బాగా రెచ్చిపోయాడని చెప్పవచ్చు.ఇక అను ఇమ్మానియేల్ కూడా అద్భుతంగా నటించింది.వెన్నెల కిషోర్ తన కామెడీ టైమింగ్ తో బాగా అలరించాడు.మిగతా నటీనటులంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

Telugu Allu Shirish, Anu Emmanuel, Vijay, Review, Rakesh Shashi-Movie

టెక్నికల్:

బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.ఈ జనరేషన్ కి తగ్గట్టుగా కథను అందించాడు డైరెక్టర్.రొటీన్ కథ అయినప్పటికీ కూడా ఎంటర్టైన్మెంట్ గా సాగింది.

సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది.మిగిలిన సాంకేతిక విభాగాలు అద్భుతంగా పనిచేశాయి.

విశ్లేషణ:

ఒక సింపుల్ రొటీన్ లవ్ స్టోరీని రాకేష్ శశి ప్రేక్షకులకు పరిచయం చేశాడు.ఇదివరకే వచ్చిన కథలాగా అనిపించినా కూడా దానిని కాస్త ఎంటర్టైన్మెంట్ గా చూపించాడు.

ఎక్కడ బోర్ కొట్టకుండా అతను అద్భుతంగా చూపించాడు దర్శకుడు.

Telugu Allu Shirish, Anu Emmanuel, Vijay, Review, Rakesh Shashi-Movie

ప్లస్ పాయింట్స్:

ఇంట్రెస్టింగ్ సీన్స్, కామెడీ, హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ, రొమాంటిక్ సీన్స్, బోర్ కొట్టని సన్నివేశాలు.

మైనస్ పాయింట్స్:

ఫినిషింగ్ టచ్ లో మరింత జాగ్రత్త పడి ఉంటే బాగుండేది.

బాటమ్ లైన్:

టీం సినిమా అయినా కూడా దర్శకుడు కామెడీ, రొమాన్స్ తో ఎంటర్టైన్మెంట్ గా చూపించాడు.

రేటింగ్: 2.0/5

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube