ఆ బాధను కేవలం అమ్మాయిలే అర్థం చేసుకోగలరు అంటున్న ఊర్వశి..!

సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో అయినా, హీరోయిన్ అయినా వారి క్రేజ్ పెంచుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం.కొందరు స్టార్ హీరోలుగా ఎదిగితే మరికొందరు మంచి అవకాశాలు రాక వచ్చిన వాటితోనే సరిపెట్టుకుంటూ ఉంటారు.

 Only Girls Will Understand That Pain..says Urvashi Rautela, Hindi Actress, Urvas-TeluguStop.com

హిందీ సినిమాలలో ఎట్టి పరిస్థితుల్లోనైనా మంచి క్రేజ్ ను సొంతం చేసుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్న నటి  ఊర్వశి రౌతేలా.ఈమె ఇప్పటికే  ‘సనమ్ రే’ ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’ ‘హేట్ స్టోరీ 4’ లాంటి కామెడీ సినిమాల్లో నటించి పెద్దగా గుర్తింపు సొంతం చేసుకోలేదు.

ఈ తరుణంలో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన హాట్ ఫోటో షూట్ లతో, బోల్డ్ ఫొటోస్ తో అభిమానులను ఆకట్టుకునే ఎందుకు తెగ ప్రయత్నం చేస్తూ ఉంటుంది.ఒకసారి ఖరీదైన లైఫ్ స్టైల్ తో మరొకసారి బోల్డ్ ఫొటోస్ తో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఈ ముద్దుగుమ్మ కేవలం భారత్ లోనే కాకుండా ఇతర దేశాలలో కూడా సందడి చేయడం మొదలు పెట్టేసింది.ఇటీవల కాలంలో ఒక మ్యాగజిన్ కు సంబంధించిన ఫోటో షూట్ కి సంబంధించిన ఓ వీడియోను ఆమె సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసింది.

వీడియోలో ఆమె ఖరీదైన, స్టైలిష్ డ్రెస్ తో పాటు కోటి రూపాయల విలువచేసే ఆభరణాలు ధరించి ఫోటో షూట్ లో పాల్గొన్నట్లు సమాచారం.ఈ తరుణంలో మేకప్ చేయించుకొని డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఒక సంఘటన చోటుచేసుకోవడంతో ఊర్వశి ఒక్కసారిగా ఉలిక్కిపడింది.ఆ సంఘటన ఏమి అని అనుకుంటున్నారా.?! ఊర్వశి డాన్స్ ప్రాక్టీస్ చేస్తుండగా ఆమె చేతికి ధరించిన డైమండ్ రింగ్, బ్రాస్లైట్ ఒక్కసారిగా కింద పడిపోయాయి.దీంతో ఒక్కసారిగా ఆమె వెంటనే డాన్స్ ప్రాక్టీస్ స్టాప్ చేసి తెగ కంగారు పడిపోయింది ఊర్వశి.

దీంతో అక్కడే ఉన్న వారు వెంటనే ఆ డైమండ్ రింగ్, బ్రాస్లెట్ తీసుకొని ఆమె చేతికి మళ్ళీ అలంకరించారు.ఇందుకు సంబంధించిన వీడియోలు ఊర్వశి తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ “అత్యంత ఖరీదైన వస్తువులు కింద పడిపోయే సమయంలో వచ్చే బాధ కేవలం అమ్మాయిలకు మాత్రమే తెలుస్తుంది ” అని తెలియజేసింది.

ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube