ఐటెం సాంగ్ కోసం అన్ని కోట్లా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పవన్ కళ్యాణ్ క్రేజ్ ముందు ఈ హీరో కూడా నిలబడ లేడు అనేది మనకు తెలిసిన విషయమే…అయితే ఇప్పుడు ఆయన వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీ గా ఉన్నాడు…ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న మేన‌ల్లుడు సాయి ధరమ్ తేజ్ క‌ల‌యిక‌ లో తెర‌కెక్కించిన మెగా మ‌ల్టీస్టార‌ర్ `బ్రో` మూవీ( Bro movie )… ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని ద‌ర్శ‌క‌న‌టుడు స‌ముద్ర‌ఖ‌ని డైరెక్ట్ చేస్తున్నాడు.జీ స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లపై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రంలో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

 Urvashi-rautela-special Song Remuneration In Pawan Kalyan Bro , Bro Movie , Spec-TeluguStop.com

రోహిణి మొల్లేటి, సుబ్బరాజు, తనికెళ్ల భరణి, బ్ర‌హ్మానందం త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు…

థ‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నాడు.తమిళ చిత్రం `వినోదయ సీతమ్`కు రీమేక్ గా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.

 Urvashi-rautela-special Song Remuneration In Pawan Kalyan Bro , Bro Movie , Spec-TeluguStop.com

ఇక తమిళ్ లో ఈ మూవీ కి డైరెక్షన్ చేసిన సముద్ర ఖని( Samuthirakani ) గారే ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు…ఈ సినిమాలో పవన్‌ దేవుడి పాత్ర పోషిస్తే సాయి ధ‌ర‌మ్‌ తేజ్‌ మాత్రం మార్క్ అనే ఒక యువకుడి పాత్రలో న‌టించాడు.దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం జూలై 28న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.

ఇక‌పోతే ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ ను ప్లాన్ చేశారు.ఈ స్పెష‌ల్ సాంగ్ ను మొద‌ట ర‌కుల్ ప్రీత్ సింగ్ చేత చేయించాల‌ని అనుకున్నారు…

Telugu Bollywood, Bro, Pawan Kalyan, Samuthirakani, Tollywood, Urvashi Rautela-M

కానీ, ఆఖ‌రి నిమిషంలో ఆమె హ్యాండ్ ఇచ్చింది.దాంతో ఐటెం సాంగ్స్ కు కేరాఫ్ గా మారిన బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వ‌శి రౌతేలా( Urvashi rautela )ను ఎంపిక చేశారు.హైదరాబాద్ సిటీలో ఓ స్టూడియోలో ఈ స్పెషల్ సాంగ్ కోసం భారీ ఖ‌ర్చుతో ఓ పబ్ సెట్ వేశారు.

ప్ర‌స్తుతం అక్క‌డే బ్రో ఐటెం సాంగ్ ను చిత్రీక‌రిస్తున్నారు.ఊర్వ‌శి రౌతేలా కూడా ఈ సాంగ్ షూట్ కోసం హైద‌రాబాద్ కు చేరుకుంది.

Telugu Bollywood, Bro, Pawan Kalyan, Samuthirakani, Tollywood, Urvashi Rautela-M

పవన్ క‌ళ్యాణ్‌, సాయిధరమ్ తేజ్ లతో కలిసి ఊర్వశి ఈ సాంగ్ లో ఆడిపాడ‌నుంది.అయితే బ్రో ఐటెం సాంగ్ కోసం ఊర్వ‌శి రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు.ఇన్ సైడ్ టాక్ ప్ర‌కారం ఊర్వ‌శి ఏకంగా రూ.2 కోట్లు ఛార్జ్ చేస్తుంద‌ట.అందుకు ఒక్క రూపాయి త‌గ్గినా సాంగ్ చేయ‌న‌ని చెప్ప‌డంతో.మేక‌ర్స్ అంత మొత్తం ఇచ్చేందుకు ఒప్పుకోక త‌ప్ప‌లేద‌ని అంటున్నారు.ఇక ఈ విష‌యం తెలిసి నెటిజ‌న్లు షాకైపోతున్నారు.ఊర్వ‌శి రెమ్యున‌రేష‌న్ తో ఒక రెండు చిన్న సినిమాలు తీయవచ్చు అని అంటున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube