ఓపెన్ ఆఫర్ ఇచ్చేసిన నల్ల గులాబీ పిల్ల

టాలీవుడ్‌లో హీరోయిన్లు అందాల ఆరబోతలో ఓ లిమిట్ పెట్టుకుని వెళ్తుంటారు.ఇక స్టార్ హీరోయిన్లు అయితే ఈ విషయంలో చాలా ఆచితూచి ముందుకెళ్తారు.

 Urvashi Rautela Open Offer For Skin Show, Urvashi Rautela, Open Offer, Skin Show-TeluguStop.com

అసలు స్కిన్ షో అంటే ఇప్పుడిప్పుడే ఓకే అంటున్నారు మరికొందరు.అయితే బాలీవుడ్ భామలు మాత్రం స్కిన్ షోకు ఎలాంటి లిమిట్ పెట్టకుండా దూసుకుపోతున్నారు.

దీంతో టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఎక్కవగా బాలీవుడ్ బ్యూటీలను ఇక్కడికి తీసుకొచ్చి తమ సినిమాల్లో అందాల ఆరబోత చేయిస్తున్నారు.

కాగా ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో హాట్ బ్యూటీగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న బ్యూటీ ఊర్వశి రౌతేలా, ఇప్పుడు టాలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు రెడీ అయ్యింది.

బ్లాక్‌రోస్ అనే సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ దక్షిణాది చిత్రాలపై మనసు పారేసుకుందట.అందుకే ఇకపై ఇక్కడ ఎలాంటి ఆఫర్ వచ్చినా చేసేందుకు సై అంటోంది.

ఈ క్రమంలోనే సినిమా డిమాండ్ చేస్తే, తాను స్కి్న్ షో చేసేందుకు రెడీ అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చేస్తోంది.

మరి తెలుగు దర్శకనిర్మాతలు ఊర్విశి పాప ఇచ్చిన ఓపెన్ ఆఫర్‌ను ఎంతవరకు ఓకే అంటారో చూడాలి.

ఇక ఈ బ్యూటీ నటిస్తోన్న బ్లాక్‌రోస్ కోసం ఆమె అభిమానులతో పాటు మాస్ మసాలా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’లో ఓ అదిరిపోయే హాట్ సాంగ్‌లో చేయాల్సిందిగా ఊర్వశికి ఆఫర్ వచ్చినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

కానీ ఆ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube